ఎప్పటినుండో నా బ్లాగ్‌లో రాయాలనుకుంటున్న కొన్ని విషయాలను బద్దకంతో వాయదావేస్తూవస్తున్న నాకు నవతరంగంలో " మహిళాదర్శకులు అయితే మాత్రం..? " వ్యాసంలోని కొన్ని వ్యాక్యానాలు  నేను అనుకున్న విషయానికి కాస్త మోక్షం ఇచ్చినట్లు అయ్యింది. ఆడ, మగ జెండర్ మద్యన దృక్కోణాలు వేరు వేరుగా ఉంటాయన్న అక్కడి వ్యాసానికి చాలా మంది తమ వ్యాక్యానాల ద్వార విబేదించారు...చాలా వరకు జనరల్‌గా ఆడైనా మగైనా తాము తీసే సినిమా జనరంజకంగా తీస్తే బావుంటుందనో..!! లేక వాళ్ళు తీసే సినిమాలలో ఆడవారు తీసారా..? లేక మగవారు తీసారా అన్న విభజనరేఖ చేయడమేంటి..? అన్న ప్రశ్నలు కూడ సందించారు..! మరి కొందరు..ఇంకాస్త ముందుకెళ్ళి కొందరివ్యక్తులమీద ఉన్న ఒక ఫిక్సడ్ అభిప్రాయం వలన వ్యాసంలోని విషయాన్ని లోతుగా చూడలేకపోయారనిపించింది. ఈనా నామాటల్లొ కాన్‌ఫ్లిక్ట్ ఉందనుకోండి. నేను చెప్పిందే వాస్తవం అవాలని రూల్ లేదుకదా..? కాకపోతే విషయాన్ని విషయంగానే చర్చిస్తే కాస్తైనా " సత్యం " చూడవచ్చుననే అనుకుంటున్నా.
       అక్కడ చాలా మంది వ్యక్తపరిచిన అభిప్రాయంలో జనరలజైషన్ ఉన్నది..! జనరల్‌గా నాతో సహా ఎవరికైనా, లేక చాలా వరకు... ఆడ, మగ మద్యన తారతమ్యాలేంటి..! హెచ్చుతగ్గులేంటి..! ఇద్దరు సమానమే అన్న విషయంలో వేరే అభిప్రాయం వుండదనే అనుకుంటున్నా..! జనరల్‌గా ఇలాంటి మాటలు చెప్పుకోడానికి కూడ బానే ఉంటాయి.. కాని ఇక్కడ రెండు విషయాలున్నాయి, అలా ఉండాలి..ఇలా వుండాలి..ఆలా ఉంటేనే సమాజం ముందుకు సాగుతుంది అని చెప్పుకునే మాటలు. అలానే వుండాలి అని అనుకోవడం వేరు..! ఇక రెండవది వాస్తవంగా ఆచరణలో ఆడ, మగ ఈ ఇద్దరూ బయటి ప్రపంచాన్నితమ తమ దృక్కోణంలోనుండి చూస్తున్నది ఏమిటి..? జరుగుతున్నది ఏమిటి ..? అన్నది తరచి చూడాలి ..ఇదివేరు ..! ఈ రెండిటిని కలిపి ఒకే విదానంలో చూస్తున్నారనిపిస్తుంది.  ప్రస్తుతం రెండవ విషయాన్నే నవతరంగంలో ప్రస్తావించారనుకుంటా..??  స్త్రీ తన దృక్పదం నుండి బయటి ప్రపంచాన్ని..చుట్టూ జరుగుతున్న సంఘటనల్ని ఎలా చూస్తన్నది..? ఏమి అనుకుంటున్నది...?? ఇలాంటి విషయాలు స్త్రీ  తను తీసే సినిమాలలో ప్రతిబింబిస్తే అది బయటిప్రపంచానికి మరో విభిన్నత స్పష్టపర్చినట్లవుతుంది..! ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే ఇద్దరి మగవాళ్ల మద్యన ఆలోచనావిధానలలోను..అభిప్రాయలలోనూ బేదాలు వుంటాయి..అలాగే ఇద్దరి స్త్రీల ఆలోచనల మద్యన కూడ తేడాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు స్త్రీ, పురుషుల ఆలోచనావిదానంలో కూడ తేడా ఉన్నట్లే కదా..? వారి దృక్పదాలు వేరుగా ఉన్నట్లే కదా..? పోనీ మరో విదానం తీసుకుందాము...నవలలు చదివే వారికి యండమూరి నవలలు బాగా పరిచయమే ఉంటుంది. ఆయన కమర్షియల్ నవలలో ఉండే కొన్ని స్త్రీ పాత్రలు..ఎంతో దృడచిత్తంతో, మనోనిబ్బరంతోనూ వ్యవహరిస్తూ..అద్భుతమైన తెలివితేటలతో అన్ని విషయాల్లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తూ ఉంటాయి...! అలాంటి పాత్రలు నిజజీవితంలో టార్చిలైట్ పెట్టుకొని ఎంత వెదికినా.. ఎక్కడా కనపడవు....!! ఎందుకనీ...??? అందుకు కారణం ఆ పాత్రలన్ని యండమూరి అనబడే ఒక మగ దృక్పోణం నుండి తయారు చేయబడినవి.. ఒక మగ రచయత తను ఎలాంటి స్త్రీని ఇష్టపడతాడో..ఆ స్త్రీ ఎలా ఉండాలనుకుంటాడో దానికి అనుగునంగా ఒక స్త్రీ పాత్రను సృష్టించుకుంటాడు..ఆఫ్‌కోర్స్..తనకు ఎదురైన..లేక తన జీవితానుభవంలో చూసిన కొంతమంది స్త్రీలను తన కోణంనుండి చూసిండవచ్చు..వారినే కాస్త అటో ఇటోమార్పులు చేసి తన నవలలో జొప్పిండవచ్చు.. కాని అది కూడ మగ దృక్పోణమే నుండే కదా..?? అంతెగాని నిజానికి స్త్రీ తనకు తాను ఎలా ఉంటుందో ఆ స్త్రీకి తప్ప పక్కవారికి ఎవరికీ తెలియదు..అంతెందుకు ఆ నవలలు చదివే స్త్రీ పాఠకులు కూడ ఆ నవలలోని స్త్రీ పాత్రలను చాలా అబ్బరంగా చూస్తారు..ఆరాధనగా చూస్తారు..కొందరు ఇష్టపడతారు..కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు. అందుకు కారణం ఆ పాత్రలన్నీ నిజజీవిత స్త్రీల దృక్పదాని ప్రతిబింబించట్లేదు కనుక..!?  ఇలాంటిదే మరో ఉదాహరణ... 1994 లో అనుకుంటాను " ప్రేమ " అనే ఒక కాన్సెప్ట్ మీద ముగ్గురు రచయతల నుండి సీరియల్ రాయించింది ఆంధ్రజ్యోతి వారపత్రిక యజమాన్యం. యండమూరి, యుద్దనపూడి , మూడో రచయత్రి.. ఎప్పుడూ వినని కొత్తపేరు.. వెన్నెలకంటి వసంతసేన... ఈ ముగ్గరి సీరియల్స్ ఒకేసారి ప్రతివారం వారం పక్క పక్కనే ప్రచురితమయ్యాయి. వాటిని గమనిస్తే చాలా వరకు అర్థమవుతుంది. యండమూరి నవల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..యూనివర్సల్‌గా మానసిక విశ్లేషణతో నవల అసాంతం నడిపిస్తారు.. అదీను చదివే పాఠకులను ఆకట్టుకునే విదంగా రాయగల సమర్ధుడాయన.. కాబట్టి ఆయన నవల మీద పెదగా చర్చించినవసరం లేదు. మిగిలింది 23 ఏళ్ళ వెన్నెలకంటి వసంతసేన రాసిన నవల గురించి చాలానే చర్చించవచ్చు అందులో ప్రతి పాత్ర తనవైపునుండి మాట్లాడుతున్నప్పుడూ నిజమే అనిపించేలా చర్చిస్తుంది..! మానవసంబందాల మీద ఒక 23 ఏళ్ళ అమ్మాయి విశ్లేషణాత్మకంగా నవల రాయడం ఆశ్చర్యం కలిగించింది. అప్పట్లో ఈ సీరియల్ మీద ఆంధ్రజ్యోతిలో చాలానే వేడి వేడిగా..వాడి..వాడిగా చర్చలు జరిగాయి. ఇక మిగిలింది యుద్దనపూడి గారు రాసిన నవల..అది అచ్చు ఒక మహిళా దృక్కోణంనుండే వెలవడినట్లు స్పష్టంగా కనపడుతుంది.. అందులోని స్త్రీ పాత్రలన్నింటిలోను ఒక స్త్రీ తన కోణంలో చూసే దృక్పదం ప్రస్పటంగా కనపడుతుంది. మరి వెన్నెలకంటి వసంతసేన కూడ స్త్రీనే కదా..? అని అనుకోవచ్చు..కానీ తీరా చూస్తే ఆ నవల రాసింది తోటకూర రఘు అని ఒక రచయత అమ్మాయి పేరు మీద నవల రాసారట..!!, ఈ విషయం కోందరి నా రచయత మిత్రులద్వార తెలుసుకున్నాను. ఒకే కాన్సెప్ట్‌తో ఉన్న ఈ మూడునవలలను మా అమ్మగారితో సహా కొంతమంది రకరకాల వయసులో ఉన్న స్త్రీల చేత చదివించాను.. విచిత్రమేమంటే..యండమూరి రాసిన నవల విషయంలో పెద్ద మాట్లాడకపోయినా..వెన్నెలకంటి వసంతసేన ( తోటకూర రఘు) రాసిన నవలను విపరీతంగా విమర్శించారు. యూనివర్సల్‌గా స్త్రీలందరికీ యుద్దనపూడి గారి నవల తెగ నచ్చేసింది...! అర్థమైనదనే అనుకుంటున్నాను నేను చెప్పాలనుకున్నదేమిటో...??.

  మరో నా స్వీయ అనుభవం...1994 కాలంలో అనుకుంటాను బెంగళూర్‌లో ఒక ప్రొఫిషినల్ కోర్స్ చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న " యువనిక " అనే  సంస్కృతి, సాహిత్య, స్పోర్ట్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక ప్రభుత్వ సంస్థలో నేను పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. అప్పటి ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ తన స్వంత వూళ్ళో జాతీయ ఆటలపోటీలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలను కవరేజ్ చేయడానికి కొంతమంది పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్స్‌‍తో సహా నేను, ఆ సంస్థ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ఆ గేమ్స్‌లలో పాల్గోనేందుకొస్తున్నా పి.ఆర్.ఓ గారి కూతురు, ఓ ఐదుగురు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మిని బస్‌లో ముఖ్యమంత్రిగారి ఊరయిన " కార్కాల " కు బయలుదేరాము. మంగళూర్‌కి వెళ్ళే మార్గమద్యంలో ఒక చోట " సుబ్రమణ్య " అని ఒక పుణ్యక్షేత్రమున్నది. ఇది అచ్చు మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం లాగ ఉంటుంది చూడడానికి. పాత్రికేయమిత్రులంతా ఒక సారి దేవాలయానికి వెళ్ళి వద్దాం అని అనడంతో..అటువైపుకు వెళ్ళాము. దారి పొడవునా రహదారికిరువైపుల పెద్ద పెద్ద చెట్లతో పచ్చని ప్రకృతి. ఆ దారి మద్యలో ఒక చోట నది ప్రవహిస్తూ ఉండి దానిమీద చెక్కతో చేసిన పెద్ద బ్రిడ్జి మీదుగా వెళ్ళాము..అది చూసిన మేమందరం బస్సుని ఆపి ఆ అమ్మాయిలు తప్ప  డ్రైవర్‌తో సహా అందరం దిగాము. ప్రకృతిని చూసి పరవశించని జీవి అంటూ ప్రపంచంలో ఉండదనే అనుకోవచ్చు. ఆ ప్రకృతిని చూస్తూ మైమరిచిపోతున్నారు అందరూ.. అక్కడున్న నదిలో నీరు చాలా స్వచ్చంగా అడుగుభాగన ఉన్న రాళ్ళతో సహ కనపడుతూ తేటతెల్లగా ఉన్నాయి. అవన్నిమైమరిచి చూస్తున్న పి.ఆర్.ఓ బస్సు‍లోనే ఉన్న తన కూతుర్ని. ఆ అమ్మాయి ఫ్రెండ్స్‌ని పిలిచాడు. వాళ్ళు చెవుల్లో హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని బాలీవుడ్ హీరో షారుఖ్  ఖాన్ " సోకాల్డ్ ప్రేమ "  పాటలు వింటూ " ఊహు " అంటు తల అడ్డంగా ఊపారు రామంటూ..!  చూస్తున్న నాకు కాస్త ఆశ్చర్యమేసింది..!! పూర్వకాలం నుండి మన భావకవులు తమ కవిత్వంలో స్త్రీని ప్రకృతితో పోలుస్తారు కదా..!! మరి వీళ్ళేమిటి...!! ఈ ప్రకృతి వీళ్ళనేమి కదిలించట్లేదా..?. అసలు సినిమాలలో దర్శకులు చూపిస్తున్న హీరోయిన్ ప్రకృతికి ప్రవశించిపోయే దృశ్యాలు మన మెదుల్లో నిక్షిప్తమయ్యాయా..? ఒక సారిగా  మణిరత్నం తీసిన " గీతాంజలి " సినిమా గుర్తొచ్చింది..అందులోని కథానాయకి ప్రకృతివడిలో వర్షంలో తడుస్తూ పాట పాడే దృశ్యం కదలాడింది..! మరి ఈ అమ్మాయిలేంటి..?? సినిమాలోలాగ అమ్మాయిలందరూ ఎగిరి గంతులేస్తూ పాటపాడతారనీ కాదు గాని.., ప్రకృతిని తిలకించడానికి ఆసక్తి చూపట్లేదే..?  అలా అని ఆ ఐదుగురు అమ్మాయిల్లాగే  ప్రపంచంలోని మిగతా స్త్రీలందరూ ఉంటారనుకునే మూర్ఖుడ్ని కాను నేను..ఆ విషయం వేరు..ఇక్కడ అనవసరం కూడాను..కాని ఆ సంఘటన వలన నాకో కొత్త విషయం... కాస్త లోతుగా ఆలోచించడానికి అవకాశమొచ్చింది..కొద్దిగా కొద్దిగా అంతక్షవులు తెరుచుకోవడం మొదలెట్టాయి..! 
      
       గీతాంజలి సినిమాలో మణిరత్నం కోణంలోని హీరోయిన్ అలా గంతులేస్తూ ప్రకృతిని ఆశ్వాదిస్తున్నది..అంటే అదొక మగవాడి దృక్కోణం. మణిరత్నంకి నచ్చేవిదంగా తన దృక్కోణంనుండి సృష్టించబడ్డ స్త్రీ పాత్ర అది..! తన దృష్టిలో స్త్రీ ఎలా ఉంటే బాగుంటుందో..నచ్చుతుందో  అలాంటి స్త్రీని తను సృష్టించుకున్నాడు. అదీ అందరికీ నచ్చేలా కమర్షియల్ యాంగిల్‌లో అవిష్కరించాడు. అంతేకాని నిజజీవితంలోని స్త్రీ అంతరంగం వేరు..అన్నది స్పష్టమవుతూ వచ్చింది  అప్పటినుండే పెణి అనో లేక పెన్వి అనో సరిగ్గ గుర్తులేదుగాని..నటి, దర్శకురాలైనా రేవతి దర్శకత్వం వహించిన ఒక టి.వి సీరియల్‌తో మొదలుపెట్టి మహిళా దర్శకుల సినిమాలు  చూడడం ప్రారంభించాను. వాటిల్లో ఖచ్చితంగా గమనించవచ్చు స్త్రీల దృక్పదం. అలా మీరా నాయర్, అపర్ణాసేన్, గురిందర్ చద్దా, అప్పుడెప్పుడో..సినిమాలు చేసినా పాక్షికంగా స్త్రీల దృక్పదం కనపడే శ్రీమతి భానుమతి రామక్రృష్ణ సినిమాలలో స్త్రీల దృక్కోణం చూడవచ్చేమో..!! ఇక రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావుల సినిమాలలో ఉండే స్త్రీ పాత్రలు వారి వారి కోణమే నుండి వచ్చినవే తప్ప..నిజమైన స్త్రీలు కాదనుకుంటా..! తర్వాత బాలచందర్, భారతీరాజ సినిమాలలోని స్త్రీలు కూడ అంతే..! కాకపోతే ఇక్కడ మహిళా సమస్యలు వేరు..మహిళా దృక్కోణం వేరు ఈ రెండిటిని ఒకే గాటన కట్టి చూడకండి. చాలా మంది అదే చేస్తున్నారు.. బాలచందర్ మహిళా దర్శకులకంటే మహిళా సమస్యలమీద సినిమాలు బాగా తీయగలడు అని అంటున్నారు..అక్కడ దృక్కోణం వేరు..సమస్యలు వేరు..మళ్ళీ ఇక్కడో తిరకాసు ఉన్నది..ఒక మగవాడికి మహిళా సమస్యల పట్ల ఉన్న perspective వేరు..అదే సమస్యల పట్ల స్త్రీలకున్న perspective వేరుగా ఉంటుంది.
        చూట్టూ వున్న సమాజాన్ని, ప్రపంచాన్ని చూసే స్త్రీ దృక్పదం మగాళ్ళకంటే ఖచ్చితంగా బిన్నంగా ఉంటుందన్నది సుస్పష్టం..! అలాగే మగాళ్ళ దృక్పదం కూడా స్త్రీల దృక్పదానికి భిన్నమే..! ఆ విషయాన్నే నవతరంగంలో ప్రస్తావించారనుకుంటున్నాను. దర్శకురాలైనా నందినిగారి ఇంటర్‌వ్యూ నేను చూడలేదు ..చదవలేదు..! వ్యాసంలో చెప్పినట్లుగా మరోకరిలాగ సినిమా తీయను అనో..లేక తీస్తాననో చెప్పడం అన్నదే కాస్త ఆలోచనలో పడేస్తున్నది.. ఒకరిలాగ సినిమా తీయడమేమిటి..? ఉదా: ఒక కొత్త దర్శకుడు/ దర్శకురాలు వచ్చి నేను పలాన దర్శకుడిలా.. ఏ విశ్వనాధో..మణిరత్నంలానో. రామ్‌గోపాల్‍వర్మలానో సినిమా తీస్తాను అని చెబితే..! వారిలాగ తీస్తానన్న కొత్త దర్శకుడితో ఎందుకు సినిమా తీయించాలి..అదేదో...విశ్వనాధగారితోనో ..మణిరత్నం..వర్మ గారితోనే సినిమా మొదలెట్టవచ్చుకదా..? మళ్ళీ కొత్త దర్శకుడితో తీయడమెందుకూ..? ఎవరికి వారికంటూ వారి సొంత ఆలోచనా..కొత్తదనం ఉండాలి గాని..! అలా  స్టేట్‌మెంట్ ఇచ్చేముందు తరచి చూసుకునే ఉండుంటే బాగుండేమో..?. ఎన్నో కష్టాలు పడి..ఎంతోమంది నిర్మాతలను కలిసి వారిని తన కథతో ఒప్పించడానికి నానా యాతలు, తిప్పలు పడివుంటారు..ఎన్నో కష్టాలు ఓర్చింటారు..బహుశ ఆ ప్రస్టేషన్‌లో వచ్చే స్టేట్‌మెంట్ అలా వుంటుందేమో..?? కాకపోతే  ఆవిడ తీసిన ఏ సినిమా రిలీజ్ కాకమునుపే అభిప్రాయాలు..నిర్దశాలు..వ్యక్తపరచడం..అంత సబబు కాదేమో..!!?

6 comments:

మంచి విశ్లేషణకు ప్రయత్నించారు. బహుశా నేను రాసుంటే చాలా అకడమిక్ చర్చలాగా ఉండేదేమో ;) మీరు చాలా అర్థమయ్యేలా రాశారు. అభినందనలు. దీన్ని నవతరంగంలో రిజాయిండర్ గా పెట్టెయ్యాలనిపిస్తోంది.

ఇదిగో బలాగు ఓనరూ ఈ కత్తిగానికి నీపోస్టు నచ్చిందంటే నీకెంత పెమాదమో తెలుసా?? ఈడికెతిరేకంగా వుండేటోళ్ళు ఇక నీ మీదబడి నీనుంచి దేశాన్ని రచ్చిత్తారు జాగర్తబ్బాయా

Read మహిళా దర్శకులైతే? at
http://vivaadavanam.blogspot.com/2010/11/blog-post_27.html

కమల్,
"నవలలు చదివే వారికి యండమూరి నవలలు బాగా పరిచయమే ఉంటుంది. ఆయన కమర్షియల్ నవలలో ఉండే కొన్ని స్త్రీ పాత్రలు..ఎంతో దృడచిత్తంతో, మనోనిబ్బరంతోనూ వ్యవహరిస్తూ..అద్భుతమైన తెలివితేటలతో అన్ని విషయాల్లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తూ ఉంటాయి...! అలాంటి పాత్రలు నిజజీవితంలో టార్చిలైట్ పెట్టుకొని ఎంత వెదికినా.. ఎక్కడా కనపడవు....!!"
అలాంటి స్త్రీలను నేను నా చిన్న జీవితంలో కొంతమందిని ఇండియాలోనే చూడడం జరిగింది. ఇక అమెరికాలో అయితే, అలా వుండే స్త్రీల శాతం చాలా ఎక్కువే(నా అభిప్రాయం, మరియు ద్రుక్కోణం ప్రకారం). ఒక మనిషి నిజమైన అంతరంగమ్ తెలుసుకోవాలంటె, చాలా కష్టమేమో.

Interesting analysis.

One request - please re-post this with paragraph breaks. Thanks

@పండు.
టార్చ్ లైట్ పెట్టినా..అన్నది.! స్త్రీలను తక్కువగా చూస్తున్నట్లు కాదు, విమర్శించినట్లు కాదు..గాని..అదొక మగవాడి దృక్కోణం నుండి వచ్చిన పాత్రలు..అని మాత్రమే.! అన్ని రకాలుగా బాలెన్సడ్ అన్నది ఎవరికైనా కష్టమే..అది అసాద్యం కూడ, ఇంకా చెప్పాలంటే స్థితప్రజ్ఞత అనొచ్చేమో..అది కేవలం హిమలయాల్లో ఉండే యోగులకు మాత్రమే సాద్యం, వాళ్ళు కూడ ఈ సంఘంలో జనజీవన స్రవంతిలో ఉంటూ ఆ విదంగా ఉండడం గగనమే.!

@కొత్తపాళీ గారికి.
మీరు చెప్పినట్లే చేసాను.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followersమాలిక: Telugu Blogs