ఆగష్ట నెల మూడో తేది సోమవారం ఉదయం 5:30కు మొదలయింది మా రోడ్ ట్రిప్....  జడ్చర్ల లో కర్నూల్ నుండి వచ్చిన మధు అనే నా కాలేజి క్లాస్‌మేట్‌ని పికప్ చేసుకొని అక్కడ నుండి బాదామికి మద్యాహ్నానికి చేరాము.        మరసటి రోజు ఉదయం పదుకొండు గంటల వరకు అక్కడ చూడాలసిన ప్రదేశాలు చూసి. అక్కడ నుండి గోవాకు ప్రయాణం.. ఒక పక్కన వర్షం, మంచు.. కొండల మీదుగా...మేఘాల మద్యన పచ్చని ప్రకృతిలొ ఒక పక్కన  పాత పాటలు వింటూ ప్రయాణం. మాటల్లో వర్ణించలేని అనుభూతి..! 

 రాత్రికి గోవా చేరుకొని అక్కడే గెస్ట్ హౌస్‌లో బస.. మరసటి రోజు సమయాలనుకూలతను బట్టి కొన్ని ప్రదేశాలు చూసేసి ఆ మరసటి రోజు ఉదయం మద్యాహ్నంగా ప్రయాణం.... బీచ్ వెంబడీ రోడ్ ప్రయాణం...మరో వైపు పచ్చదనం.  కార్వార్ మీదుగా  గోకర్ణ చేరి..అక్కడ నైట్ హాల్ట్. మరసటి ఉదయం అక్కడ నుండి మురుడేశ్వర్. అక్కడ నుండి జోగ్ ఫాల్స్ అవి చూసుకొని సాగర్ మీదుగా షిమొగా చేరి అక్కడ నైట్ హాల్ట్.
        మరసటి రోజు ఉదయం అక్కడ నుండి ఇక్కేరి అనే కేలడి రాజుల చారిత్రక ప్రాంతం సంధర్శన..తర్వాత తీర్థ హల్లి మీదుగా ఆగుంబే. మద్యలో కుంభవృష్టితో వర్షం. ఆ వర్షంలోనే మేఘాల మద్యన ఘాట్ రోడ్ లో ఎత్తైన కొండ మీద కుండాద్రి బెట్టను చేరుకొన్నాం అదొక అడ్వేంచర్ మాకు. కింద ఏమున్నదో కూడ కనపడనంతగా మేఘాలలో వుండిపోయాము. అక్కడ నుండి సాయింత్రం ఆగుంబే చేరాము. కాని చుట్టు పక్కల చూట్టానికి వాతావరణం అనుకూలించలేదు. చాలా జలపాతాలు, ల్యాండ్ స్కేప్స్ మరియూ కుద్రేముఖ్ లాంటి సీనరీ కలిగిన ప్రదేశాన్ని చూడలేకపోయాము..  కుంభవృష్టితో ఒక్కటే వాన.  అక్కడ నుండి  బయలు దేరి రాత్రి తొమ్మిదికి ఉడిపికి చేరుకొని అక్కడే నైట్ హాల్ట్.. దర్శనాలు..అన్నీను.

పొద్దున్నే సేయింట్ మేరీ ఐల్యాండ్ చూడాలనుకొని వెళ్లాం.. ఊహు.  సముద్రంలో తుఫాన్ కదిలకలతో ఐల్యాండ్ కూడ క్యాన్సిల్.. అక్కడ నుండి మడికెరకు ప్రయాణం.... మద్యలో...!!

  కార్కాల అనే వూరికి చేరాం. ఇదే వూరికి నేను ఓ 15 ఏళ్ల క్రితం నేషనల్ గేమ్స్ నిర్వహించినప్పుడు ఒక ముఖ్యమంత్రి సొంత వారు కావడం చేత ఇక్కడకు వెళ్లాను. తిరిగి ఇప్పుడు గుర్తు పెట్టుకొని వెళ్లాను. ఇక్కడొక విశేషమున్నది..! అక్కడ నుండి మూడబిదిరి లోని జైన్ దేవాలయాన్ని చూసుకొని సాయింత్రం మడికెరి ( కూర్గ్) చేరుకొన్నాం. కాని కూర్గ్‌కు వెళ్లే మార్గ మద్యలో వున్న ఘాట్ రోడ్ మాత్రం భలే వున్నది, ఎన్నెన్ని వొంపులు..ఎన్నెన్ని మెలికలో.. స్టీరింగ్‌ను తిప్పుతూ కూర్చోవాల్సిందే.. అదీను ఆకు పచ్చని కొండల నడుమ..  ప్చ్ ఆ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ చేయడమన్నది ఒక అడ్వేంచరే..!  ఫుల్ ఆఫ్ జాయ్ అంటే ఏమిటో అర్థమవుతుంది.
      మరసటి రోజు ఉదయం వర్షంలోనే "అబ్బి ఫాల్స్" చూసుకొన్నాం.. అక్కడకు దగ్గరలోనే "మండద పట్టి" అనే కొన్ని ల్యాండ్ స్కేప్స్ వున్న ప్రాంతాలు వున్నాయి. కాని నా ఫ్రెండ్స్ అనాసక్తితో చూడకుండానే వెనుతిరగాల్సి వొచ్చింది. అక్కడ నుండి కోస్‌కోడె అనే కేరళ ప్రాంతానికి ప్రయాణం అయ్యాం. ఇక ఆ ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు గానీ.. చాలా రద్దీగల రహదారి అది. మద్యలో  "తలసరి" అనే వూరులో భోజనం. అక్కడే వున్న ఒక చిన్న పాటి కోటను సందర్శించి తిరిగి అక్కడ నుండి "కోజ్‌కోడె" కు సాయింత్రానికి చేరుకొన్నాం. వర్షాకాలం వలన అక్కడ బ్యాక్ వాటర్ బోట్ హోమ్‌లో బస చేయడానికి అవకాశం లేకపోవడం వలన అక్కడ నుండి గురువాయర్‌కు వెల్దామని ఫ్రెండ్స్ ప్రప్ఫొజల్‌తో..  ఇంత వరకు చూడలేదాయన్ని..  సరే నేను చూసినట్లుంటుంది.. అలాగే ఒక పలకరింపు పలకరిస్తే ఓ పనైపోతుంది కదా రాత్రికి గురువాయర్ చేరుకొన్నాం.
 తెల్లారు జామున్నే గురువాయిర్‌ని పలకరించేసాను, పాపం అక్కడికొచ్చే ప్రతి భక్తుడు ఏదో కోరిక కోరడం.. అందుకోసమే ఆయన్ని దర్శించుకోవడం చేస్తున్నారు, ఒక్కరు కూడ ఆయన క్షేమ సమాచారాలు విచారించ లేదు..!!  బహుశ నేనొక్కడీనే అనుకొంటాను.. "ఎలా వున్నావయ్యా, అంతా క్షేమమే కదా.. కుశలమేనా" అని కుశలోపరి ప్రశ్నలతో పలకరించి... అక్కడ నుండి మున్నార్‌కు బయలు దేరాం.
  మున్నారు పచ్చని ప్రకృతి అందాలలొ ఓ రెండు మూడు రోజులు గడిపేసి మూడో రోజున తెల్లారు జామునే హైదరాబాద్‌కు బయలు దేరాం. మద్యలో మధురై మీదుగా ప్రయాణం చేసి మరసటి తెల్లారు జామున రెండు గంటలకు ఒక ఫ్రెండ్‌ని కర్నూల్‌లో అతని ఇంటి వద్ద దింపేసాము. బాగా డ్రైవ్ చేసే మూడ్‌లో వుండటం మూలాన అక్కడే నిద్రకు ఉపక్రమించకుండా.. అలానే హైదారాబాద్‌కు బయలు దేరి తెల్లారు జామున ఆరుగంటలకు నా గమ్య స్థానం చేరుకొన్నాం.  దాదాపు 24 గంటలు నిర్విరామంగా డ్రైవ్ చేయడం..అందునా  వర్షంలో.... అదొక అడ్వేంచర్.. అనుభూతినిచ్చింది.  నా స్టామినా మీద నేనే ఒక ప్రయోగం చేసుకొన్నాను. మొత్తం పదిహేను రోజుల పాటు 3,600 కిలోమీటర్ల  పచ్చని ప్రకృతిలో ప్రయాణం  చేసి..చేసి పచ్చగా మారిపోయాను.... నేనొక్కడినే డ్రైవ్ చేయడం.... ఒక ఆనందం. ఫ్యూచర్‌లో దేనికి పనికిరాకుండా పోయినా "డ్రైవర్" ఉద్యోగం చేసుకోనైనా బతకొచ్చనే ధైర్యం వచ్చిందబ్బా..!

  ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మొత్తం ఈ ట్రిప్ అంతా నాకు కొత్తే.. ఏ దారులు తెలీవు, కాని "గూగుల్" మ్యాప్ ద్వారా మొత్తం తిరిగాను. గోవాలొ గల్లీ గల్లీ తిరిగాను. అస్సల్ ఎటుపోతే ఏది వొస్తుందో..! ఎక్కడికి చేరుతామో కూడ తెలియని నేను. పుర్తిగా గూగుల్ మ్యాప్ మీద ఆదార పడ్డాను.  
ఎక్కడ.. ఎన్ని కిలోమీటర్ల్ వద్ద.. ఎన్ని మీటర్ల వద్ద ఎటువైపు మలుపు తిరగాలో కూడ ప్రతీది చెబుతూ వచ్చింది ఆ గూగులమ్మాయ్..గొంతు మాత్రం యమ స్వీట్. ఒకో సారి దగ్గరి దారిలో తీసుకెళ్లి గమ్యం చేరుస్తుండేది..! ఒక వేళ దారి తప్పోయినా ..? తప్పోయిన దారి నుండి మళ్లీ డైరెక్షన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది పాపం ఆ గూగుల్ అమ్మాయి... ఎంత మంచిదో. ?   జై గూగులమ్మాయ్..!!
 తర్వాత ప్రాముఖ్యత కలిగిన ఒక్కో ప్రాంతం యెక్క వివరాలు, ఫోటోస్‌తో మరో పోస్ట్ పెడతాను.
2 comments:

nice pics andi and chala baga varnincharu mee trip viseshalu

Nice Trip and photos.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followersమాలిక: Telugu Blogs