ట్యాంకబండ మీద మార్చి 10 న జరిగిన సంఘటనలకు కారణం ముమ్మాటికీ మీరే..మీరే..మీరే..! తప్పదు ఆ అపనింద, మీరు మోయాల్సిందే..!! మీరు చేసిన పనివలన ఇప్పుడు తెలంగాణ పోరాటయోధుల మీద ఎన్ని అభాండాలో.. ఎన్ని అపనిందలో..బయటి ప్రపంచంలో ఎన్ని చీత్కారాలో.. చూశారా..?? మీరు ఎంతో మక్కువతో, ప్రీతితో ప్రతిష్టింప చేసిన విగ్రహాల వలన ఎంత మందికి ఎన్నిరకాల అవమానాలో గమనిస్తున్నారా..? ముఖ్యంగా 600 మంది తెలంగాణ అమరవీరులు ప్రాణత్యాగం చేసిన పోరాట స్పూర్తి మీద నిన్న జరిగిన ఈ విగ్రహాల దాడి ఎంతటి మాయన మచ్చలా మిగిలిందో..చూడండి..!!
అవును మహానుభావ..! తమరు ఎంతో మక్కువతో ప్రతిష్టింప చేసిన ఆ విగ్రహాల మూర్తులు " మేము మరణించాక మా శిలావిగ్రహాలను రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టించండి " అని మిమ్మల్ని గాని లేక మరెవరితోనైనా విన్న వించుకున్నారా..? లేదే..!! పాపం వారేదో వారి జీవితంలో వారికి తోచినది.. తాము అనుకున్నది పట్టుదలతోనూ.. అకుంఠిత దీక్షతోనూ.. సమాజంలో జరగుతున్న అవతవకల మీద పోరాడి సమాజ శ్రేయస్సుకోసం తమ జీవితాన్ని అంకితం చేశారు.. అది తమ విది అనుకున్నారు. అంతే గాని.. తమ తదనంతరం తమ రూపాలతో విగ్రహాలు చేయించి..పూజించ బడాలని కోరుకోలేదే..? కనీసం అలాంటి తలంపు కూడ వారి మదిలో మెదిలిండదు..! మరెందుకయ్యా వారి ప్రతిరూపాలని చెక్కించి ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టించి.. చివరికి ఇప్పుడు ఇలా కొంతమంది " పోరాట యోధుల " చేత పెకలింపబడి నడిరోడ్ మీద మెడకు తాళ్లేసి ఈడ్చి హుస్సేన్‌సాగర్‌లో పడేలా చేశారు..??
పాపం అన్నమయ్య ! తనకే ప్రాంతీయ, కుల భేదాలు లేని మనిషి. తనేదో భక్తి పారవశ్యంలో కొన్ని వేల పాటలు రాసి వాటికి బాణీలు కట్టి తెనుగుకే శోభ తెచ్చి తన సాటి తెలుగువారందరికీ ఎన్ని తరాలైన తరగని మరువలేని సంగీత అమృతాన్ని అందించారు. అంతమాత్రాన 600 మంది ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కంటే అన్నమయ్య గొప్పవాడా..?
ఎర్రాప్రగడ.. పాపం పిచ్చోడు..! ఆయనెప్పుడు అనుకొని వుండరు.. తను మహాభారతంలో కొన్నిపర్వాలను తెనుగులోకి అనువాదం చేసిన పాపానికి తన ప్రతిమతో ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టింపబడి కొంత మంది త్యాగధనుల చేత ముక్కలు ముక్కలుగా గావించబడతానని...!!. ఇక " తెలుగదేలయన్న దేశంబు తెలుగేను... దేశభాషలందు తెలుగు లెస్స " అని పలికిన పాపానికి పక్క రాష్ట్రం వాడు.. పరాయి భాషకు చెందిన శ్రీకృష్ణదేవరాయలును సైతం వదలలేదు..మన త్యాగమూర్తులు.! మనల్ని ఎంతోగాను గౌరవించిన మనిషిని మనం గౌరవించిన తీరు..బేష్..చాలా బాగుంది. ఇలా ఒకరేమిటి.. గుఱ్ఱం జాషువా..బళ్లారి రాఘవ. విప్లవాలకు ఆనవాలైన శ్రీశ్రీ. ఆదికవి నన్నయ భట్టు. త్రిపురనేను రామస్వామి చౌదరి. సమాజంలోని సాంఘీక దురాచాలాను రూపుమాపేందుకు కృషి చేసిన సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం.మువ్వగోపాల పదాలను మురిపెంగా ఆలపించిన క్షేత్రయ్య. ఇలా ఎందరో వైతాళికులకు అవమానం జరగడానికి కారణం మీరు కాదా యన్.టి.ఆర్ గారు..??
అంతే కాదు మీరు గాని ఆ విగ్రహాలను ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టింప చేయకుండ వుండుంటే వాటి మీద దాడి చేసే అవసరమే తెలంగాణ పోరాటయోధులకు వచ్చుండేది కాదు. వారి మీద అన్ని అపనిందలు వచ్చుండేవి కావు..! ఆ తప్పంతా మీదే..మీదే...యన్.టి.ఆర్ సారూ....!! మీది కాదంటారా..? కాదంటారా..? కాదేమోనా..!! అదెలా..? లోతుగా ఆలోచించాలా..!! కూసింత లోతుగా ఆలోచిస్తే ....నిజమే తప్పంతా మీది కాకపోవచ్చు..! తప్పంతా మీలో ఉన్న సంస్కారానిది, మన తెలుగువాళ్లు అని తలించిన మీ కృతఙ్ఞతది, అవును మాస్టారూ.. తెలుగుజాతికి స్పూర్తి ప్రధాతలై, పధనిర్దేశుకులై, దృవతారలగ నిలిచి మానవ చరిత్రకు రూపకల్పన చేసిన మహనీయులను స్మరించుకోవడం, గౌరవించుకోవడం మన కర్తవ్యం అనుకొన్న మీ ఔనత్యానిది సర్ తప్పంతా....! ఒక విషయం గమనించారా..! ఈ సంఘటన జరగకమునుపు వరకు ట్యాంక్‌బండ్ మీద ఉన్న మహనీయ విగ్రహాలు చూసినప్పుడల్లా " ఆహా యన్.టి.ఆర్ ఎంత మంచి పని చేశారు. తన రాజకీయచరిత్ర ఎలా ఉన్నా " అని అనుకునేవాడిని, కాని ఇప్పుడూ ఈ సంఘటన జరిగాక మీ మీద నింద మోపాల్సి వస్తున్నది. చూశార..!! నిన్నటివరకు మంచి అనుకున్నది కాలంతో పాటూ మారుతూ ఈ రోజు చెడు అవుతున్నది..నిన్నటి దినం చెడు అనుకున్నది ఈ రోజున మంచి అవుతున్నది. తెలుగు భాష మీద, వైతాళికుల మీద మీకున్నంత అభిమానం. కృతఙ్ఞత, అభిలాష సాటి తెలుగువారమైన మాకు లేవు సర్.. మాకు ఏ చరిత్రా అవసరం లేదు..ఏ మహనీయులు అవసరం లేదు...! మా సంకుచిత భావాల ముందు మీ మహనీయుల విలువ ఎంత..? మాకు కావలసింది కేవలం మా వ్యక్తిగత క్షేమమే.. వ్యక్తిగత అభివృద్దే..! మా వ్యక్తిగత ఆకాంక్ష కన్నా ఏ మహనీయులు గొప్పవారు కారు. కావాలనుకొంటే మీరు చెబుతున్న ఆ మహనీయుల్లోని వ్యక్తులను మేము కులాలవారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా విడదీసి పంచుకొని గౌరవిస్తాము. కనీసం మీరు ఆ విదంగా సంతృప్తి పడండి మాస్టారు. అంతెందుకు సార్ ఎవరన్న ఒక విశిష్ట వ్యక్తిని తీసుకుందాము, మేము అతనిలో వున్న ప్రతిభనో లేక వ్యక్తిత్వాన్నో చూసో గౌరవించం, ఆ వ్యక్తి యెక్క కులాన్ని చూసో లేక ప్రాంతాన్ని చూసో ఆ మనిషి యెక్క ప్రతిభను గుర్తించి గౌరవిస్తాము. అది మా తత్వం. ఆ ప్రాతపదికగనే మహనీయులను పంచుకుంటున్నాము కూడా. అంతెందుకు ఇప్పటికీ మిమ్మల్ని కూడ ప్రాంతీయ, కులాల ప్రాతిపదికంగా చూస్తూన్నాము అంతే కాని.... ఒక తెలుగువాడిగా దానికన్నా ముందు కళారంగంలో ప్రతిభావంతుడైన ఒక విశిష్ట వ్యక్తిగా గుర్తించటం లేదు... ఇది ముమ్మాటికి నిజం.
అయినా మీ పిచ్చిగాని మాస్టారు, ప్రస్తుత ప్రపంచీకరణ ఆర్థిక సరళీకృత విధానాలలో కొట్టుకుపోతూ మమ్మల్ని మేమెప్పుడో కోల్పోయి చాలా కాలం అయ్యింది, మాకు మా మూలాలు ఏవీ అవసరము లేదు. దేశంలోనికి, రాష్ట్రంలోకి ఏ కొత్త ప్రక్రియ వచ్చినా పోలోమంటూ ఒక " గొర్రె " దాటులా వెళ్తున్నాము. మెమెప్పుడో పరాయికరణ చెంది వున్నాము మా ప్రస్తానమంతా ఒక వ్యాపారం దిశగా ఒక వ్యక్తిగత లాభాపేక్ష దిశగా సాగుతున్నది. వీటి మద్యలో మీరింకా మహనీయులు.. మహాత్మలంటూ ప్రాకులాడితే ఎలా మాస్టారూ...?
ఇంతజరిగినా.. ఇప్పటికి మీరు మహనీయులుగా భావిస్తున్న ఆ విగ్రహాలను " వట్టి విగ్రహాలు " గానే చూస్తున్నాము. మరి వట్టి విగ్రహాలు అని తెలిసీ ఎందుకు వాటిని ద్వంసం చేసామో అని మమ్మల్ని మేము ప్రశ్నించుకునే సంస్కారం మాలో కనపడట్లేదు...! అవి వట్టి విగ్రహాలు కాదని మాకూ తెలుసు ఆ విగ్రహాలు వెనుక కొన్ని భావాలు, ఆరాధనలు వున్నాయని తెలుసు.. ఆ విగ్రహాలు మాటున మీ భావాలను ఆరాధనలు విద్వేషంతో ద్వంసం చేయాలన్న ఉద్దేశంతోనే చేశాము... అయినా మేము వాటిని " వట్టి విగ్రహాలు " అనే బుకాయిస్తాము. విగ్రహాలు కావాలనుకుంటే మళ్లీ పునర్‌నిర్మించుకోవచ్చు అదే 600 మంది ప్రాణాలు తిరిగి తేగలమా ? నిజమే పోయిన ప్రాణాలు తిరిగి తేలేమూ..!! అదే విదంగా విద్వేషంతో విగ్రహాలను ద్వంసం చేసి తిరిగి మళ్లీ పునర్‌నిర్మించుకోగలమూ కాని ఆ ద్వంసరచన చూసి గాయపడి ముక్కలైన కొందరి మనుషుల భావాలను మళ్లీ అతికించుకోగలమా..? అయినా పోయిన ప్రాణాలకూ ఈ విగ్రహాల విద్వంసానికి లంకె ఏమిటి..? అది సరే మాస్టారు 600 మంది ఆత్మార్పణం చేసుకొన్న అమరవీరులెక్కడ..! కేవలం పుట్టారు కాబట్టి ఏదో కొన్ని పనులు చేసినందుకే మహనీయులని ఒక ట్యాగ్ తగిలించిన ఆ పాతకాలపు మనుషుల విలువ ఎక్కడ..? వారికి వీరికి పోలికేంటి..!! వారేమన్న ఆత్మార్పణం చేశారా..? లేక సాధించుకోవడం చేతకానప్పుడు ఎమోషనల్‌గా బెదిరించడానికి ప్రాణత్యాగం చేశారా...చెప్పండి..? మా 600 మంది అమరవీరుల ప్రాణాలు పోయాయి కాబట్టి మేము దానికి బదులుగా ఎన్నో విద్వంసాలు చేస్తాము.. అది మా హక్కు..దాన్ని కాదనడానికి ఎవరికీ ఏ హక్కు లేదు... అర్హతా లేదు.
అయ్యా యన్.టి.ఆరూ అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వివాదలతో ముగిసింది మీ మరణం..! దానిగురించి పెద్ద పేచీ లేదు కాని, మీరింకా ఇప్పటి వరకు బ్రతికే ఉండుంటే ఈ సంఘటన చూసి మీ గుండె పగిలి మరిణించేవారు.. దీని కన్నా అప్పటి మరణమే మేలనపిస్తుంది.. ఇలాంటివి చూడకూడదనే మీరు ముందుగానే స్వర్గస్థులైనారు, అంతకన్న అదృష్టం ఎవరికుంటుంది..! శుభం......
రాష్ట ప్రభుత్వం వారికి నాదో విన్నపం : అయ్యా ఘనత వహించిన ముఖ్యమంత్రిగారు, ప్రభుత్వ అధికారుల్లారా..! ఇప్పటికైనా మించిపోయినది ఏమి లేదు.. విద్వంసం తర్వాత ఇంకా మిగిలిన కొన్ని విగ్రహాలు ట్యాంక్‌బండ్ మీదనే వున్నాయి.. ఆ మిగిలిన విగ్రహాలను కూడ దయచేసి అక్కడనుండి పెకలించి ఏ గోదాములలోనో లేక మీ ప్రభుత్వ కార్యాలయ స్టోర్ రూములలొనో పడేయండి.. అక్కడన్న మనస్సాంతిగా వుంటాయి. ఆ మహనీయులు తమ తదనంతరం ఏ కీర్తిని కోరుకోలేదు, ఏ విగ్రహాలు తయారు చేయాలని కోరుకోలేదు.. ఏదో తమ వంతు చేయవలసిన కార్యక్రమాలు, సంస్కరణలు, మానవాళికి ఉపయోగేపడే విధానాలు, పనులు నిర్వర్తించి వెళ్లిపోయారు. వారు ఏ పూజలు కోరుకోలేదు, ఏ కీర్తిని ఆశించలేదు. పాపం యన్.టి.ఆర్ గారు తనలోని కళారాధనను సంతృప్తి పరుచుకోవడానికి ఆ మహనీయులు ప్రతిరూపాలను నిర్మించి ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టించారు. ఇప్పుడేమో మనం వర్గాల వారిగా విడిపోయి ఆ మహనీయులను ద్వంసం చేయడానికి పూనుకొన్నాము. వారి ఆత్మ ఘోషిస్తుంది. ఎందుకు వారిని బాదపెట్టడం.. ఎక్కడో ఒక గదిలో ఏదొక మూలన వున్నా పర్లేదు.. ఏగొడవలు, విద్వంసాలు లేకుండా జీవితం ప్రశాంతంగా గడుస్తుంది వారికి. ఇంకా ఆ ట్యాంక్‌బండ్ మీద అలానే వుంచితే మళ్లీ ఏ మార్చో..లేక ఏ గర్జనో..లేక ఏ బాగో కార్యక్రమం లాంటివి తలపెట్టి మిగిలిన ఆ విగ్రహాలను కూడ ద్వంసం చేస్తారు.. అలా జరగకమునుపే మీరు త్వరపడి..వాటిని అక్కడ నుండి తరలించండి. ఆ విగ్రహాలకు మనస్సాంతిని కలిగించండి. త్వరపడండి.. ఈరోజు సంఘటన రేపటికి మరుపుని తెస్తుంది అది అనివార్యం కూడ.. మళ్లీ ఎప్పుడో ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు మళ్లీ మనస్తాపం..! అలాంటివి మళ్లీ జరగకుండా త్వరపడండి
10 comments:
really nice post.
Nice expression
Well Said. Well Written. A very good post.
ముగ్గురు అపరిచితులకు థ్యాంక్స్
well Said, very nice post.
వి'గ్రహాల' విద్వంసం!
జాతి రత్నాలు అంటున్నావ్, ఎవడి జాతి..
బొమ్మలు తగలబడితేనే నీకు చరిత్ర, సంస్కృతీ గురుతోచ్చిందా..
అసలు నీకు 'ఆత్మ' ' గౌరవం' అంటే అర్థాలు తెలుసా..
కూలిన నీ చరిత్ర కారులని అడిగి తెలుసుకో బ్రదర్
తెలుగు జాతి తగల బడింది అని కుల్లుతున్నావ్
తెలంగాణా జాతి మాటేప్పుడైనా వినపడిందా
వారు గొప్ప వారు కావొచ్చు..
కాని నా తల్లి గుండె మీద
నిప్పులై మండుతున్నారు
ఎపుడైనా నీ ఎసి కార్లల్ల తిరుగుతుంటే
కనపడిందా మా గోస
హుస్సేన్ సాగర్ నిండా నా తల్లి కంటి నీరే కదా..
భాషని, యాసని హేళన చేసి చూసే నీకు
ఎక్కడిదిరా హక్కు
జాతి గురించి ఊసెత్తడానికి
అందమైన హైదరాబాద్ ను తయారు చేసిన
నా రాజుల చరిత్ర ఏది?
ప్రపంచ పటంల నా జాతి ని నిలబెట్టిన
నా నిజాం పరిమళాలు కలుషితం చేసి
మా కొమరం భీమ్ ధైర్యానికి , వీర చరిత్రకు మసి పూసి,
అయిలవ్వను , యాదగిరిని , బందగిని బొందపెట్టి
ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నావ్..
రాయి బద్దలయితే రాద్ధాంతం చేస్తున్నావ్,
బొమ్మ పగిలితే గుండె పగిలినట్టు
గంటలూ గంటలూ రొద పెడుతున్నావ్
నువ్వు నిలబడ్డ జాగా నాది,
నా జాగా చరిత్ర ఏది? సంస్కృతీ ఏది?
నా బిడ్డలు ఏరి..
ఓ గురజాడా, ఎర్ర ప్రగడ, ఇంకా ప్రజా కవులారా..
మీరు చేసిన తప్పంతా..
రక్త మాంసాలు తినే నర రూప రాక్షసుల చేతుల్లో పడడమే,
మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మా జాతి ని మట్టు బెట్టి,
మా చరిత్ర సమాధుల మీద మిమ్మల్ని నిలబెట్టడమే
మేము గురి పెట్టింది మిమ్మల్ని కాక పోవచ్చు,
మీరు చేసిన కృషిని కాకపోవచ్చు..
మా ఆక్రోశం బద్దలు అయింది
భాల్ల్లున పగిలింది మీ బొమ్మల పైన..
మీ జాగా ఖాళి అయితేనే కదా
మా చరిత్రలు నిలబడేది
ఒకటి అంతం అయితేనే మరొకటి మొదలు..
మా జాతి కోసం ప్రాణాలు అర్పించిన
అమర వీరుల సమాధులకు కూడ
జాగా లేదు, వారికి చోటియ్యనియండి,
బొమ్మలకి బాద పడే మీరు..
బిడ్డలు కళ్ళముందు కాలుతుంటే
ఒక్క కన్నీటి బొట్టు కూడ రాల్చ లేదే?
కవితలు రాల లేదే, పుస్తకాలు అచ్చు కాలేదే ?
మీ మాటలు కత్తుల్ల దిగుతుంటే
ముక్కలైన మా మట్టిని ,
బూడిదైన మా సంస్కృతిని
మళ్లీ నిలబెట్టుకున్దామనే
చరిత్రని మల్లా తిరగ రాస్తున్నాం,
ఇక్కడ మీకు , మీ గొప్ప చరిత్రలకు
స్తానం లేదు..అందమైన విగ్రహాలకు
విడిది కాదు నా ఇల్లు,
ఆగమైతున్న బతుకు చిత్రాలకు
కొలువు..
భుతల్లి కన్నీట మునుగుతున్నాం
గర్భ శోకంతో కుంగి పోతున్నాం..
మోసాలకు ఎత్తులకు జిత్తులకు
విసిగి వేసారి ఉన్నాం..
కొలిమిల్లాగా మండుతున్నాం..
దగ్గర కొస్తే ఆగం అయితారు..
మాట్లాడే సహనం లేదు,
బ్రతిమిలాడే క్వాయిష్ అంత కన్న లేదు
మిగిలినవి చేతలు , చేతులే ..
ఆవేశం అంటుకున్నది
ఆవేదన అలుముకున్టున్నది..
మంచి చెడుల మధ్య
చెరిగిన రేఖ..
న్యాయ అన్యాయాల మధ్య నలిగిన
సత్యం..
ఇప్పటికైనా ...
నా భూమ్మీద నా బిడ్డలకే హక్కు..
మేమూ ప్రజా కవులను ప్రేమిస్తాం..
మీ చరిత్రనూ నిలబెడతాం..
మా చేతుల మీదుగా
మేము ప్రశాంతంగా
స్వేచ్చగా గాలి పిలచిన రోజు..
...సుజాత సూరేపల్లి
http://nanokiran.blogspot.com/2011/03/blog-post_4586.html
@ above అజ్ఞాత
నిజమే బాస్. మీది తెలుగు జాతి కాదు. నువ్వు మాట్లాడేదీ తెలుగు కాదు. నీకు తెలుగు రాదు. నీ తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు. కదా
అవును హుస్సేన్ సాగర్ నిండా నీ తల్లి కన్నీళ్ళే. నిన్న మీరు చేసిన విధ్వంసానికి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది పాపం
మీ కొమరం భీమ్ ధైర్యానికి మసిపూసారా? ఎవరికి చెప్తావు బాస్. ఇందాకటి నుంచీ చెప్తున్నా మీరు పెట్టుకోలేదేమో గానీ ఎక్కడో నెల్లూర్ లో కొమరం భీమ్ విగ్రహం పెట్టుకున్నారు. మరి ఆ ధైర్యం ఎవరు గుర్తించినట్టు? మీరా? వాళ్ళా?
రాయి అని ఇంకో సారంటే ఆ రాయితోనే మూతి పళ్ళు రాలగొడతాం. ఊరుకున్న కొద్దీ తెగ పెరిగిపోతోంది మీ ఉన్మాదం. చేతనైతే చార్మినార్ లో ఒక్క రాయి కదిలించి చూడు. ఉన్న చోటే పాతిపెడతారు. అక్కడికెళ్ళి చెప్పు ఇది రాయే కదా అని.
ఇలా విడిపోతాం, విడిపోతాం అనే జార్ఖండ్, చత్తీస్ ఘడ్ ఇప్పుడు లాక్కో లేక పీక్కో లేక చస్తున్నాయి. అది చూసి కూడా మీకు బుర్రలో బల్బు వెలగదా? అయినా మీ నేల, మీ మట్టి ఏంటి? ఇండియాలో ఎక్కడయినా నీ నేలె, నా నేలె. చేతనయితే నువ్వు కూడా రా మిగిలినప్రాంతాలకి , అంతే కాని రావద్దు, ఉండద్దు అనే హక్కు నీకే కాదు ఈ దేశం లో ఎవడికీ లేదు.
ఒక్కటి చెప్పనా తమ్ముడూ పైన తధాస్తు దేవతలు ఉంటారట. ఇలా ఎప్పుడు చూసినా మా బ్రతుకులింతే, మేం నాశనం అయిపోయాం, మాకు తినడానికి తిండి లేదు ఇలా అనుకుంటూన్నారనుకో ఎప్పుడో వాళ్ళు తధాస్తు అంటారు. మీ సరదా తీరిపోతుంది.
>>>అవును హుస్సేన్ సాగర్ నిండా నీ తల్లి కన్నీళ్ళే.
డ్రైనేజి నీళ్ళు, మూసీ నీళ్ళు, హుసేన్సాగర్ నీళ్ళు కార్చే తల్లి! :))
కన్నీరు కూడా స్వచ్చతలేదు, కుళ్ళు, కంపు వుందన్న సంకేతం పాఠకులకు వెళుతుందన్న బుద్ధి కట్‌పేస్టరుకు లేకపోవడం నవ్వుతెప్పించింది.
కల్తీ కల్లు తాగితే పచ్చటి పుసులు కట్టి హుసేన్సాగర్ నీళ్ళలాంటి కన్నీళ్ళు వస్తాయి. కల్లు తాగే తల్లులు, పిల్లలూ వారి సంసృతి, సాంప్రదాయం అని కెసిఆర్ ఎన్నడో చెప్పాడు.
అపరిచితులుకు నా విజ్ఞప్తి, విన్నపం; మీ కామెంట్స్ లలో తిట్లు,అక్కసుతో ఆరోపణలు, విద్వేషంతో కూడిన వ్యాక్యలు లేకుండా వివక్షతా రహితంగా, ఆచరణాత్మకమైనా కామెంట్స్ చేయాలని నా మనవి, అర్థం చేసుకోండి. నేను ఏవర్గానికి చెందిన మనిషిని కాను.
Post a Comment