కథాకాలం : 80 వ దశకం 90 దశకం మద్యకాలం
" ఎక్స్‌క్యూజ్‌మె సర్ " అన్న పిలుపుతో పాఠాలు చెబుతున్న లెక్చరర్‌తో సహా పాఠాలు వింటున్న విధ్యార్థులు క్లాస్‌రూమ్ గుమ్మం వైపు చూసారు...నూనూగుమీసాల కుర్రాడు కాస్త బెరుకు బెరుకుగా విద్యార్థులందర్నీ పరికరించి చూసి, లెక్చర్ వైపు తల తిప్పి " సర్..వంశీ కావాలి " అన్నాడు. లెక్చరర్ అతని వైపు ఎగాదిగా చూస్తూ " ఓ పదినిమిషాల్లో క్లాసైపొతుంది...వేయిట్ చేయ్ " అని మల్లి పాఠాలు చెప్పడం మొదలెట్టాడు. క్లాస్ రూమ్‌లో పాఠాలింటున్న వంశీ ఇదంతా చూసి...." వీడెందుకొచ్చాడు కాలేజికి....!! అంతవసరమేమొచ్చింది....!" మనసులో అనుకున్నాడు. వచ్చిన కుర్రాడు వంశీ చిన్నాన్న కొడుకు, బందుత్వం కారణంగా అవసరమైనప్పుడు కల్సినా కూడా...వంశీకి అతనికి మద్య పెద్దగా స్నేహం లేదు..అందుకే అతను కాలేజిరావడం ఆశ్చర్యం కలిగించింది.

ఇదే చివరి రోజు కాలేజికి...ఈ రోజుతో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ క్లాసెస్ అయిపొతాయి, మిగిలింది ప్రాజెక్ట్ వర్క్, పరీక్షలే. చివరిరోజన కావడంతో కాలేజంతా విద్యార్థులతో సందడిసందడిగా ఉన్నది, క్లాస్ అయిపోవడంతో బెల్ కొట్టారు..బయటకొచ్చిన వంశీ ..కాస్తదూరంలో వేపచెట్టు క్రింద నుంచుని ఉన్న కజిన్ వైపు చూసి..." ఏంట్రా " అన్నట్లు కనుబొమ్మలు ఎగిరేస్తూ దగ్గరికి వెళ్ళాడు.. ఆ కుర్రాడు కొద్దిగా గాబారాతో.." అన్నా ఆ భద్రగాడు నీకోసం మనుషుల్నేసుకొని తిరుగుతున్నాడు " చెప్పాడు.
" నాకోసమా...? దేనికి..? " ఆశ్చర్యంగా చూసాడు వంశీ
" అదేనన్నా..." నానుస్తూ..." ఏదో లవ్‌లెటర్ గురించంటా..." అన్నాడాకుర్రాడు.
" లవ్‌లెటరా..? " విషయం అర్థమైనాకూడా తనకి తెలీనట్లు ఉంటూ " ఏం లవ్‌లెటరూ .." సాలోచనగా ఆలోచిస్తున్నట్లు నటిస్తూ.." సర్లే నేను చూసుకుంటా నువ్వింటికెళ్ళు " అన్నాడు. ఆ కుర్రాడు వెనుతిరిగి వెల్తుండగా
" రేయ్ ..చంద్రా " పిలిచాడు, ఆ పిలుపుతో వెనుతిరిగిన చంద్రను చూసి..
"ఈ విషయాలేవి మన ఇళ్ళల్లో గానీ..బయటగానీ..ఎక్కడా చెప్పొద్దు " అన్నాడు, " అలాగే " అంటూ తలూపి వెళ్ళిపోయాడు చంద్ర.
" రేయ్ ..చంద్రా " పిలిచాడు, ఆ పిలుపుతో వెనుతిరిగిన చంద్రను చూసి..
"ఈ విషయాలేవి మన ఇళ్ళల్లో గానీ..బయటగానీ..ఎక్కడా చెప్పొద్దు " అన్నాడు, " అలాగే " అంటూ తలూపి వెళ్ళిపోయాడు చంద్ర.
" ఛ...తప్పుచేసాను..చాలా తప్పుచేసాను " తనలో తను అనుకొనే మాటను బయటకనేసాడు.. కొద్దిసేపు లోలోపల ఆలోచించాక..మనసులో ఏదో స్పరించి తనలో తను నిర్ణాయానికొచ్చినట్లు తలఊపి కాలేజికి దగ్గరగా ఉన్న ఒక కాలనీవైపు దారితీసాడు.
* * *
అది మిట్టమద్యాహ్నం కాలనీవీధులన్ని ఖాలీగా ఉన్నాయి..అక్కడక్కడ ఒకరిద్దరు మనుషులున్నా ఎండవేడిమికి తాలలేక గబగబా నడుస్తున్నారు.
" ఏరా ఈ టైమ్‌లో వచ్చినావ్ " కాంపొండ్ గేట్ తీసుకొని వస్తున్న వంశీ ని చూసి ఆశ్చర్యంగా అడిగాడు చంద్రహాస్‌రెడ్డి,
" అదేరా లవ్‌లెటర్ విషయం..తెల్సుగా నీకు ..! ఇప్పుడు మొదలయ్యింది గొడవ.. " చెప్పాడు వంశీ.
చంద్రాహాస్‌రెడ్డి కి అర్థమైనట్లు తలఊపుతూ " అదెప్పటిమాటో కదా ఇప్పుడేమయింది " అడిగాడు
" నన్ను కొట్టడానికి ఆ భద్రగాడు మనుషులతో తిరుగుతున్నాడట ..మా చిన్నాయన కొడుకు కాలేజికొచ్చిచెప్పాడు " అనగానే
" వానికీ...లెటర్‌కీ సంబంధమేంటీ..? " అర్థం కాక అడిగాడు చంద్రహాస్
"R.T.A శీనుగాడు..వీడు బాగా ఫ్రెండ్స్‌లే..శీనుకోసం వచ్చినట్లున్నాడు "
" వాడేమి పోటుమగాడంటనా..? వెళ్ళి మాట్లాడదామంటావా..? ఉండు బట్టలు మార్చుకొని వస్తా " అని లోనికి వెళ్ళి కాసేపటికొచ్చాడు.
ఇద్దరూ కల్సి కాలనీలోని మిగతా ఫ్రెండ్స్ ఇల్లకెళ్ళి విషయం చెప్పి ఓ పదిమందిని కలుపుకొని వంశీ ఉండే వీధివైపు గుంపుగా బయలుదేరారు.
వంశి, చంద్రహాస్‌రెడ్డి ఒకటవ తరగతినుండి ఇంటర్‌మీడియట్ వరకు ఒకే స్కూల్లో..ఒకే కాలేజిలో ఒకే సెక్షన్‌లో కలిసి చదువుకున్నారు, ఇద్దరి మద్యన మంచి సాన్నిహిత్యమే ఉన్నది ఇంటర్ తర్వాత వంశి ఇంజనీరింగ్‌లో చేరాడు, చంద్రహాస్ మాత్రం కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులవలన డిగ్రీ బి.ఎస్.సిలో చేరాడు. కాలేజిమారినా ఇద్దరి మద్యన ఉన్న స్నేహం చెక్కుచెదరలేదు.

భద్రగ్యాంగ్ గురించి వంశీ ఇంటిచుట్టు పక్కలవీధుల్లో కలయతిరుగుతున్నారు....ఎక్కడా ఒక్కడుకూడ కనపడట్లేదు భద్రగ్యాంగ్ మనుషులు..
" లవ్‌లెటరేంటి....ఈ లవ్‌లెటర్లేంటిరా బాబు..." అంటూ వంశీ గుంపులోంచి కామెంట్లొస్తున్నాయి..
ఇంతలో మరొకడు.." ఐనా ఈ వంశీగాడెందిరా..పెద్ద ఇంటలెక్చువల్ అనుకొంటిమి....! మన గ్యాంగ్‌లో బాగా ఆలోచించే బుర్రన్నది వీడొక్కడే. అనుకున్నాము .! ఇంతింతలావు పుస్తకాలు చదువుతూఉంటాడు ఎప్పుడూ.." అంటున్నాడు పక్కనున్నవాడితో, ఆ మాటలు విన్న చంద్రహాస్ వంశీ వైపు చూస్తూ..

" అవునూ..నీవీ లవ్వులూ..గివ్వులకీ దూరంకదరా..? ఎప్పుడు చూసినా ఫిలాసఫీ మాట్లాడుతూఉంటావు..! నువ్వూ లెటర్ రాయడం విచిత్రంగా ఉంది " నవ్వుతూ అన్నాడు.
ఆ మాటలకి ఏం చెప్పాలో తెలియక బ్లాంక్‌గా మొహంపెట్టి నడుస్తున్నాడు. తనలోతను......
' నిజమే...నాగురించి తెలిసినవాళ్ళెవరూ ఊహించరు...! అంతదాకా ఏందుకు నేనెప్పుడూ అనుకోలేదు ఒకమ్మాయికి ఇలా లవ్ లెటర్ రాయాల్సొస్తుందని...! వీళ్ళన్నట్లు నామాటల్లో ఎక్కువగా ఫిలాసఫీ ఉంటుంది..బహూశ అది నా పుస్తకపఠనంవలన అయ్యుండొచ్చు...! అదికాక నాఇంట్లో నాఫ్రెండ్స్ వచ్చిన సమయాలలో ఏదొ ఒక లావు పుస్తకం చదువుతూ కనపడేవాడిని....! ఐనంతమాత్రాన నేను ఇంటలెక్చువలైపోతానా..? ఏంటో వీళ్ళ ప్రమాణికాలు...? పోనీ ఇంటిలెక్చువల్ ఐనంతమాత్రాన ఓ " అమ్మాయి " మీద ఇష్టపడకూడదా..? '... " ఏంట్రా..ఎవరూ కనపడలేదు..! " అన్న మాటలతో ఆలోచనల్లోంచి బయటకొచ్చాడు వంశీ.
" సరే ఇంకో పదినిమిషాలు అలా తిరిగేసి..కనపడకపోతే వెల్లిపోదాము.." అన్నాడు చంద్రహాస్. సరే " పద " అంటూ అందరు మల్లి వేట మొదలెట్టారు.
వంశీ తనతోటి స్నేహితులకన్న కొంచెం భిన్నంగా ఆలోచించడానికి గల కారణం..తను ఊహ తెల్సినప్పటి నుండీ క్లాస్ పుస్తకాలు కాకుండా చిన్న చిన్న జానపద పుస్తకాలు మొదులుకొని..వంశి వయసుపెరిగేకొద్దీ... తెలుగు కమర్షియల్, సీరియస్ నవలలు. ఆటోబయోగ్రఫీ పుస్తకాలు, వాటితో పాటు కమ్యూనిస్ట్ సిద్దాంతాలైన మార్క్సిజం, మావో ఫిలాసఫీ, వీటికి ప్యారలల్‌గా జిడ్డుకృష్ణమూర్తి ఫిలాసఫీ, స్వామి వివేకానంద లాంటి భిన్నమైన వ్యక్తుల పుస్తకాలు చదవడం వలన అతని మాటల్లో పెక్యులారిటీ కనపడేది...కాని ఇవన్ని చదివినా మనుషులకుండే సహజసిద్దమైన కొన్ని మానసిక ఉద్వేగాలకు అతీతుడేమి కాదు, పుస్తకాల్లోని భావాలు కొందరి మనుషుల సృష్టే కాని అవేమి ప్రకృతి సృష్టించినవి కావుగా..కాకపోతే పుస్తకపఠనం మనిషిని బాలెన్సడ్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది... అది కొంతవరకే..మిగతా అంతా ఆయా మనుషుల మానసిక పరిస్థితి మీద ఆదారపడి ఉంటుంది, కేవలం పుస్తకాలు చదివినంతమాత్రాన పూర్తిగా మానసిక ఉద్వేగాలకు భిన్నంగా ప్రవర్తించలేరు...! ఆ రసాయనిక చర్యకు పర్యవసానమే ఈ లవ్‌లెటర్ వ్రాయడం.
భద్ర గ్యాంగ్ మనుషులు ఎవరు కనపడకపోవడంతో " సరే మేం వెళ్ళెస్తాంరా..సాయింత్రం కలుద్దాం అప్పుడుచూద్దాంలే...!" చెప్పేసి..ఒక్క చంద్రహాస్ మినహా అందరు వెళ్ళిపోయారు.
" పదరా నీఇంటిదాక వచ్చి వెల్తాను " భుజంమీద చేయేసి ముందుకు కదిలాడు చంద్రహాస్, వంశీ నడుస్తూ తనలో తాను ఆలోచిస్తూ.....' ఇలా మనషుల్నేసుకొని తిరగడం...అసలు నేనెప్పుడూ ఊహించని పరిణామం... ’ఈ పరిణామాలకు దారితీసిన గతంలోకి మెల్లిగా జారాడు వంశీ....
* * *
ఓరోజు ఉదయమే ఇంట్లో పుస్తకం చదువుతూకూర్చున్న..సమయంలో నా క్లాస్ మెట్ సారథి హడావిడిగా వచ్చి " మామా..ఒక చిన్న లవ్‌లెటర్ రాసివ్వాలి " అడిగాడు
" ఎహే...నీ లవర్‌కి నేను లవ్‌లెటర్ రాసివ్వడమేంట్రా...నీవు రాసుకోవాలిగాని....." అన్నానేను.
" అదిగాదు మామా..లాస్ట్ టైమ్ నేను రాసిస్తే..దాన్ని చించి నామోహానకొట్టింది.....! నీవైతే చాలా పోయిట్‌గా రాస్తావు...అది చదివితే..ఎంతటి పాషాణహృదయమైనా ఇట్టే కరిగి దాసోహం అవ్వాల్సిందే.."
" అబ్బా...నాచేత ఇలాంటీ తిక్కపనులు చేయించకు...నాకస్సల్ ఇష్టమ్ ఉండవు ఇలాంటివి.." అన్నా
"" మామా ..మామా..ప్లీజ్.....చచ్చి నీ కడుపున పుట్టే చాన్స్ ఎలాగూ లేదుగానీ....నా లవ్ సక్సెస్ ఐతే..నాకు పుట్టబోయే పిల్లల్లో ఎవరికోకడికి నీపేరు పెట్టుకుంటాను " నా గడ్డం పట్టుకొని బతిలాడ్డం మొదలెట్టాడు. .
" సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ " అని చెప్పి లవ్‌లెటర్ రాసి ఇచ్చాను. అది చూసి ఎగిరి గంతేసి.. లవ్‌లెటర్‌ని రెండు మూడుసార్లు ముద్దులు పెట్టుకొని..
" అందుకే మామా నీచేత రాయీంచుకునేది..ఇంత అద్భుతంగా ఎవరూ వ్రాయలేరు " అని.." మామ సాయింత్రం మన అడ్డాదగ్గర సాయింత్రం కలుద్దాం " అంటూ....హుషారుగా పాటపాడుకుంటూ వెళ్ళిపోయాడు.

ఓ ఐదారుగురం ఫ్రెండ్సంతా రెగ్యులర్‌గా సాయింత్రాలు గాంధీరోడ్డ్‌లో ఒక అడ్డావద్దా కలుస్తుండేవాళ్ళం. నా దగ్గర లవ్‌లెటర్స్ రాయించుకున్న వాళ్ళంతా అక్కడినుండే వాళ్ళ వాళ్ళ గాళ్‌ఫ్రెండ్స్‌కి లవ్‌లెటర్స్ ఇవ్వడానికి తెగ ప్రయత్నిస్తుండేవాళ్ళు.. అమ్మాయిలకు ఒక కిలోమీటర్ దూరంలో సైకిళ్ళమీదగాని..లేక మోటర్‌బైక్‌ల మీదగాని ఫాలో చేస్తూ.. ..నిర్మానుషంగా ఉన్నచోట మనుషులెవరూ లేని సమయం చూసి వాళ్ళ ప్రేమలేఖల్ని ఇవ్వడానికి తెగప్రయత్నిస్తుండేవాళ్ళు, ధైర్యంలేని మరి కొందరు రోజు..ఓ 100 వందడుగుల దూరంతో ఫాలోయింగ్‍తోనే సరిపెట్టుకొని...ఓ బాడీగార్డ్‌లా తిరిగడం, ఈ విషయం ఆ అమ్మాయి ఇంట్లో తెలియడం..వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి జరగడం...వీల్లేమో కొన్ని రోజులు దేవదాసులా మందుబాటిల్లు..! తర్వాత కొన్ని రోజులకు మరిచిపోవడం..మల్లి ఫ్రెష్ గా 100 అడుగులు దూరం మాత్రం క్రమం తప్పకుండా పాటించడం..ఇది సర్వసాదారణం అక్కడ....
అలా తిరిగే సమయాలలో...వాళ్లకొసమేవెల్తున్నారని నాకు తెలియని రోజుల్లో ఏదోపనుందని మిషమీద నన్ను కూడ వాళ్ళతోపాటుగా తీసుకెళ్ళేవారు.....! వాళ్ళు నన్ను బైక్‌నడిపే డ్రైవర్‌గానో, సైకిల్ తొక్కేమనిషిగానో ఉపయేగించుకుంటూ నా వెనకాల కూర్చొని నా మాటున అమ్మాయలకు సైట్ కొడుతున్న విషయం మొదట తెలియకపోయినా...తర్వాత తర్వాత కొద్దిరోజులకు నాకర్థమైంది, .
కోపంతో అరిచేసి " ఇలాంటీవాటికి నన్ను ఉపయేగించుకొవద్దని " వార్నింగు ఇచ్చాను. నా కోపానికి బిత్తరపోయిన వాళ్ళు...
" అదేంటి మామా అలా అంటావు..మాకంటే నీకే బాగా ఉపయోగపడింది కదా ఈ తిరుగుళ్ళు " అన్నారు, నాకర్థంకాలేదు వాళ్ళు చెప్పేదేంటో.....! నా అర్థం కాని మొహాన్ని చూసి అప్పుడు చెప్పారు.
" నీవు వీధిలోకి అడుగుపెట్టగానే తను నిన్ను ఓరు చూపులతో గమనిస్తూ ఉండేది..., నీవు కూడ అమ్మాయిని చూస్తున్నావనీ..అందుకోసమే మాతో వస్తున్నావను అనుకున్నాం " అన్నారు..వారు చెబుతున్న విషయం నాకర్థం కాలేదు.

" నేనా..! అమ్మాయిని చూడ్డమా..? నేనసలు ఎవర్నీ గమనించలేదు....ఇంతకీ ఎవరా అమ్మాయి..? " అడిగాను. అలా వారిమాటల్లోనే పరిచయం అయ్యింది హరిణి,
" మనకి ఆరునెలలక్రితం పరిచయం అయ్యాడు చూడు...R.T.A శీను...వాళ్ళ చిన్నాయన కూతురామ్మాయి..!. ఇద్దరే అమ్మాయిలు వాళ్ళమ్మానాన్నకు..నీకు బామ్మర్ది ప్రాబ్లంలేదులే..! ఈ శీను ఆ అమ్మాయి పెద్దనాన్నాన కొడుకు..అదీ విషయం " చెప్పారు
" ఏంట్రా మొత్తం వాళ్ళ కుటుంబ చరిత్రంతా తెలుసుకున్నారు..! మళ్ళీ బామ్మర్ధనీ బందుత్వమొకటి మీ మొహాలకు..! నేనింతవరకు ఆ అమ్మాయినే గమనించలేదు..ఎవరో కూడా తెలియదు...! అనవసరంగా పెద్ద విషయం చేయకండి..ఇంతటితో ఈ విషయాన్ని పొడిగించకుండా ఆపేయండి, " మళ్ళీ మళ్ళీ ఆ ప్రసక్తి ఎత్తకుండా ముగించేశాను.
* * *
తర్వాత చాలా సార్లు ఆ అమ్మాయి బయట బజార్లోనూ..మార్కెట్లలోనూ నాకెదురైయ్యేది, నేను గుర్తుపట్టలేదు కాని ఆ అమ్మాయే హరిణి అని నా ఫ్రెండ్స్ చెప్పారు, అలాఎదురైనప్పుడల్లా వోరచూపులు..పెదవిచివర మునిపంటితో బిగించి నవ్వులు రువ్వేది. అప్పుడు గమనించాను నిశితంగా ఆ అమ్మాయిని....! అందానికి " ఇదీ " అంటూ ఒక నిర్వచనం చెప్పలేనుగాని...ఆ అమ్మాయి ఆరోగ్యంగా అందంగానే ఉన్నది...! అలా ఎదురైనప్పుడల్లా నన్ను ఆసక్తిగా చూస్తూ ఉండేది ..ఆ చూపులో చిలిపితనం కనపడేది..కాటుక కళ్ళతో చూపులు విసరేది, మొదట అర్థం కాలేదు..కాని తర్వాత కాస్త ఆలోచిస్తే.. నేను నా ఫ్రెండ్స్‌తో వాళ్ళవీధిల్లో తిరిగినది తనకోసమే అనుకొని ఉంటుంది..ఓహ్ దాని కొనసాగింపే ఇప్పుడా చూపులు విసరడం.. తుళ్ళింతలూ..కవ్వింతలు కోరుకునే వయసది...కౌమారదశ..ఈ వయసులో అవన్నీ సర్వసాధారణం. ..అవి తెలుసుకాబట్టే మొదట నేను అటువైపు మొగ్గు చూపలేదు.
కాని కొన్ని రోజుల తర్వాత..ఆ చూపులు నాకు తెలియకుండానే నాలో అలజడి రేపడం మొదలెట్టాయి.. నాలో కాస్త అంతర్మధనం.....ఎన్ని రకాల పుస్తకాలు చదివినా..ఎన్ని ఫిలాసఫీ మాటలు మాట్లాడినా నేను అందరిలాగే ఆ చూపులకు ప్రతిస్పందిస్తున్నానా...? లేక యవ్వనంలో జరిగే ప్రకృతి సహజసిద్దమైన రసాయనిక ప్రతిస్పందనలొస్తున్నాయా..? ఎంత ఆలోచించినా..కట్టడి చేయాలని ప్రయతించినా.. సాద్యపడట్లేదు, వంటింట్లో అమ్మతో మాట్లాడుతున్నప్పుడూ.. కాలేజిప్రాజెక్ట్ వర్క్‌లోఉన్నప్పుడు అవే చూపులు గుర్తొచ్చి నన్ను వెంటాడేవి.....! రాత్రిళ్ళు మేడమీద నవ్వారు మంచంవేసుకొని వెల్లికిల పడుకొని ఆకాశంకేసి చూస్తూ నక్షత్రాలను లెక్కపెడుతున్నప్పుడు కూడ ఆ అమ్మాయి కాటుక కళ్ళ వాలుచూపులు వేటాడేవి....! వాటికి అందకుండా ఉండాలని పరిగెత్తి పరిగెత్తి...అలిసి..చివరకు ఆ కనురెప్పలమాటున నిదురోయేవాడిని.. ఆ తలంపుకే ఉలిక్కిపడి...ఏంటి..ఒకమ్మాయి చూపులకు ఇంతలా గిల గిలాడుతున్నా.....!! అంటే నాలోకూడా " ఐడింటిటీ క్రైసిస్ " ఉన్నదా..? మానసికంగా ఒకరి ఆలంబన కోరుకుంటున్నానా..? ఆరాటపడుతున్నానా..? లేక ఆధారపడుతున్నానా..? బయటకు ఎన్ని ఫిలాసఫీ మాటలు మాట్లాడినా, విలువలు గురించి వల్లించినా లోన మనస్సు చేసే అలజడిని నియంత్రించలేకపోతున్నానా..?.." అవునూ...ఎందుకు నియంత్రించాలీ..?... ఈ పరస్పర ఆకర్షణ మనుషుల మద్యన సహజమేకదా..? నేనేదో ఫిలాసఫీ చదువుతున్నాని....నాలో జరిగే ఈ మార్పుల్ని కట్టడిచేయాలా..? ఏందుకు చేయాలీ...చూద్దాం ఈ ప్రక్రియలో ఏముందో...! ఇదొక జీవితానుభవం...జీవితమే ఒక శోధనకదా...! ఒక స్థిర నిర్ణయానికి వచ్చి..ఇలా చూపులూ..దారికాపులు కాకుండా స్వయంగా ఎదురెదురుగా కూర్చోని మాట్లాడాలని ప్రయత్నించా..కాని ఒకమ్మాయి, అబ్బాయి కల్సి మాటాడుకునేంత స్వేచ్ఛ ఉన్న సమాజం కాదు..అలాంటి పరిస్థితులు కూడ లేవు..అందుకే లవ్‌లెటర్ వ్రాశాను. " నేను వెల్తానురా.." అన్న మాటతో ఆలోచనలనుండి బయటకు వచ్చాడు వంశీ.
" సాయింకాలం కలుద్దాంరా బై " చెప్పేసి వెల్లిపోయాడు చంద్రహాస్‌రెడ్డి.
* * *
సత్ససాంప్రాదాయలు పాటించే మద్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి హరిణి, ఉమెన్స్ కాలేజిలో బి కామ్ రెండో సంవత్సరం చదువుతున్నది, హరిణి కి ఒక చెల్లెలు పేరు స్వాతి, వీరిద్దరే హరిణి తల్లితండ్రులకు సంతానం, మగ పిల్లలు లేరు. వారు ఉంటున్న వీధికి చుట్టుపక్కల వీధుల్లో హరిణి పెద్దనాన్న చిన్నాన్న కుటుంబాలు,ఒక మేనత్త కుటుంబం ఉన్నాయి, పెద్దనాన్న, చిన్నాన్నకు ఉన్న మగపిల్లలే వీరింట సొంత సంతానంలా ఉంటారు, ఉమ్మడి కుటుంబం కాకపోయినా అన్నదమ్ముల పిల్లలు, మేనత్త కొడుకులిద్దరు ప్రతిరోజూ ఎవరో ఒకరింట్లోకలుస్తూనే ఉంటారు, హరిణి పెద్దనాన్న కుమారుడే శీను, R.T.A ఆఫీస్‌లో టెంపరరీగా పని చేస్తున్నాడు, ఊర్లో అతని ఫ్రెండ్స్ సర్కిల్లో శీను పేరుగలవారు చాలామందే ఉన్నారు పిలవడానికి కన్‌ఫ్యూజ్ లేకుండా అందరూ అతన్ని R.T.A శీను అని పిలుస్తారు. హరిణి తండ్రి మున్సిపల్ ఆఫీస్‌లో ఒక చిరుద్యోగి, తల్లి ఇంటిఇల్లాలు.
ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఉన్నది. వంశి పుస్తకాలు చదవడానికి ఎక్కువగా మున్సిపల్ లైబ్రరీ కి వెళ్తూ ఉంటాడు..అక్కడికే తన కజిన్స్ కి నవలలు తేవడంకోసం R.T.A శీను వస్తుండేవాడు, కజిన్స్ అడిగిన నవలలు లైబ్రరీలో కనపడనప్పుడు మరే ఇతర నవలలు తీసుకెల్లాలో తెలియని సమయంలో..రోజూ వంశిని అక్కడ చూస్తూఉండడం వలన అక్కడున్న నవలలో ఏవి మంచివో వంశిని అడిగి తెలుసుకొని తీసుకెళ్ళేవాడు...అలా మెల్లిగ పరిచయం అయ్యింది, ఆ పరిచయంలో సాహిత్యం గురించి, నవలల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూఉండేవాడు వంశి.., వాటి గురించి R.T.Aశీనుకు అవగాహన లేకపోయినా , వాళ్ల కజిన్స్ కి నవలలు తీసుకెళ్ళాలి కాబట్టి వాటికోసం వినేవాడు , ఆమాటలని తనంటిదాక..కజిన్స్ దాక తీసుకెళ్ళాడు R.T.A శీను, ప్రాపంచిక విషయాలమీద, సైన్స్, జనరల్ విషయాలమీద, సాహిత్య చర్చలు, ఇలా శీను మాటల్లో వెలువడిన వంశి ఆలోచనలు హరిణికి బాగా దగ్గరయ్యాయి, మెల్ల మెల్లగా.. అతనిమీద ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తికి ఒక అభిప్రాయమంటూ ఏమి ఏర్పడలేదు కేవలం సాహిత్యం అంటే ఇష్టం, పుస్తకాలు బాగా చదువుతాడు అని అంత వరకే హరిణి ఆలోచనలు పరిమితం, అదే సమయంలో వీధిలో తన ఫ్రెండ్స్ తొ వంశి కనపడినప్పుడు అతనివైపు ఆసక్తిగా చూసేది. తర్వాతర్వాత వంశి ఎక్కువగా హరిణి వీధిలో తన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా తిరుగుతుండడం చూసి తనకోసమే వస్తున్నాడా..? అని కొన్ని రోజులు సందేహించినా..!! కొద్దిరోజులకు తనకోసమే వస్తున్నాడని అనుకున్నది....అలా తనకోసం ఒక మగాడు తిరగడం అన్నది హరణి మధిలో అలజడలు రేపాయి, అంతవరకు తనబందువులతోనూ, బావలతోను, కజిన్‌లతోనూ బందుత్వసాన్నిహిత్యం తప్ప మరో భావం ఎరగదు. అలాంటి తనకు తనకుటుంబాలకు సంబందంలేని మరో వ్యక్తి తనను గుర్తించడం, తనకోసం తిరగడం హరిణిలోని స్త్రీ తత్వాన్ని తట్టిలేపింది. తుల్లిపడే వయసది మేనబావలతో ఉన్నప్పుడూ కూడ కలగని మత్తు. వంశి తనకోసం వస్తున్నాడు అన్న భావన కిక్కుని కలగజేస్తున్నది, ఆ భావాన్నిఎంజాయి చేస్తున్నది. ఆభావం ఇంకా ఇష్టంగానో లేక ప్రేమగానో రూపాంతరం చెందలేదు, అందుకు కారణం కుటుంబ కట్టుబాట్లు, సాంప్రాదాయాలు, అవెప్పుడు తమ పరిదిని గుర్తు చేస్తూనే ఉంటాయి.కాని మనసు చేసే అలజడలను ఏకట్టుబాట్లు, విలువలు నియత్రించలేవు. అది ప్రకృతి లక్షణం. వంశి ఆరడుగుల అందగాడు కాదు, స్పరదరూపి అసలేకాదు అతి సాదాసీదా మనిషి, కాని వయసకు తగ్గట్లుగా ఆరోగ్యంగా ఉంటాడు అసలు ఇవేవి కావు హరిణిని వంశి వైపు ఆసక్తి కనపరచడానికి కారణాలు...తన కజిన్ శీను మాటల్లో విన్న వంశి ఆలోచనలు, అతని భావాలు అట్టే కట్టిపడేసాయి, అందుకే వంశి ఎప్పుడు బయట బజార్లో కనబడ్డా....అతన్ని ఆసక్తిగా చూసేది...అంతకన్న ముందుకు సాగే అవకాశం లేని పరిస్థితులు...! అందులోనూ ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకునే స్వేచ్చ ఉన్న సమాజం కాదది..అలా మాట్లాడగానే " అమ్మో ఏదో జరిగిపోయింది వీళ్ళిద్దరిమద్యన " అనుకునే సమాజమది. హరిణి చూసే చూపులకు కలవరపడిన వంశి తనను తను నిబాళించుకోలేకపోయాడు....! గుర్తింపు (ఐడింటిటీ క్రైసిస్) కు..ఇష్టపడడానికి మద్య చాలా వ్యత్యాసం ఉన్నదని గుర్తించలేకపోయాడు ఆపోజిట్ సెక్స్ ఆకర్షణ అతనిలోను ప్రకంపనలు సృష్టించాయి చివరకు తనను హరిణి ఇష్టపడుతున్నదని ఒక అభిప్రాయానికి వచ్చాడు.
ఓరోజు సాయిత్రం కాలేజి నుండి రిక్షాలో తిరిగివస్తున్న హరిణికి లవ్‌లెటర్ ఇచ్చాడు, అంత అకస్మాత్ గా జరిగిన సంఘటనకు మొదట తేరుకోలేకపోయింది హరిణి, వంశి తనకు లవ్‌లెటర్ ఇచ్చే తరుణం ఎదురవుతుందని అసలు ఊహించనేలేదు, భిన్నురాలైన హరిణి కాసేపు స్తబ్దతగా ఉండిపోయిందలాగే...తర్వాత మెల్లిగా విషయం అర్థమై లెటర్ విప్పి చదువదామనుకునే సమయానికి ఇంటి దగ్గరకు చేరుకుంది రిక్షా, లెటర్‌ని పుస్తకాలమద్యన దాచేసి ఇంటిలోకి వెళ్ళిపోయింది, హరిణి నాన్న అప్పటికే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసి ఉన్నారు, కొద్దిసేపటికి హరిణి నాన్న బయట బజారులో తన మిత్రులను కలవడానికి వెళ్ళిపోయాడు, హరిణి తల్లి వంటపనిలో నిమగ్నమయ్యింది, స్వాతి క్లాస్ పుస్తకాలు చదువుతూకూర్చున్నది, ఇదే మంచిసమయం అనుకున్న హరిణి తనపుస్తకంలో దాచిన ప్రేమలేఖ తీద్దామనుకున్న సమయానికి బయటనుండి హరిణిబావ వచ్చాడు, రెండు నిమిషాలు మాట్లాడక బావ పనుందంటూ ఇంటి వెనకాల ఉన్న దొడ్లోకి వెళ్ళాడు, వెంటనే ఆలశ్యం చేయకుండా ప్రేమలేఖను తీసుకొని దొడ్లో ఉన్న తులసిచెట్టు చుట్టూ ఉన్న కోట మాటున వచ్చింది, ఎవరన్న వస్తారన్న భయంతో చుట్టూ చూస్తున్నది, మనసు స్థిరంగా ఉండడం లేదు దాని తాలుకా గాబారా ఎక్కువై శరీరం వణుకుతున్నది, అలానే నించొని వణుకుతున్న చేతులతో పేపర్‌ని విప్పుతున్నది, ఆ గాబారాలో పేపర్ సరిగ్గా మడతలు విడవట్లేదు... పేపర్ కిందపడింది....! పడిన పేపర్‌ని తీసుకుంటున్న సమయంలో అక్కడే దగ్గరలో నున్న బాత్‌రూమ్ తలుపు తీస్తున్న శబ్దం వినపడడంతో అటు వైపు చూసిన హరిణికి బాత్‌రూమ్ తలుపు తీసుకొని బయటకు వస్తున్న బావ కనపడ్డాడు, ఇంకా గాబరా ఎక్కువై చేతిలోకి తీసుకున్న పేపర్‌ని ఎక్కడదాచాలో తికమకపడుతున్నది, బయటకు వచ్చిన హరిణిబావ తులసికోట వద్ద వణుకుతూ ఉన్న హరిణిని తన చేతిలో ఉన్న తెల్లకాగితాన్ని చూసి..
"ఏంటి హరిణి..అలా ఉన్నావు..? చేతిలో ఆ పేపర్ ఏంటి.. " అంటూ దగ్గరకు వచ్చాడు,
అంతే హరిణికి గుండె జారినట్లయ్యింది ప్రేమలేఖ సంగతి తెలిసిపోతుందని అర్థమై
" సాయింత్రం కాలేజినుండి ఇంటికి వస్తున్నప్పుడు ఎవరో ఈ పేపర్‌ని రిక్షాలో పడేసారు..ఏంటా అని చూస్తున్నా " ఎవరో ఇచ్చారో తెలియనట్లు అన్నది వణుకుతున్న స్వరంతో హరిణి

" పేపరా..! ఏంటది.." అంటూ చూసాడు.
తప్పదన్నట్లు ఇచ్చేసింది బావకు, తీసుకొని చదివాక విషయం అర్థమైంది, ఈలోపల R.T.A శీను వచ్చాడు దొడ్లోకి...
" ఇక్కడున్నారా..మీకోసమే లోపల చూసి ఇక్కడకు వస్తున్నా ఏంట్రా అలా ఉన్నావు " హరిణి బావని చూస్తూ దగ్గరకు వచ్చాడు,
హరిణికి గుండే జారినట్లైంది శీనుకి కోపం ఎక్కువ అందులోను కొంచం రౌడి చేష్టలున్న మనిషి, ఏమి చేయాలో పాలుపోక బేలగా వారి చూపు చూస్తూ నిల్చుంది, మౌనంగా తన చేతిలోని పేపర్‌ని శీను చేతిలో పెట్టాడు హరిణి బావ. ఏంటిది అన్నట్లు చూసాడు శీను.
" చదువు నీకే తెలుస్తుంది " అంటూ హరిణి చెప్పిన విషయం చెప్పాడు . మొత్తం చదివాక శీను మొహం జేవురించి ఎర్రబడ్డది " వీడు నాకు తెలుసు ఏదో మంచోడు అనుకున్నా మనమ్మాయికే లవ్‌లెటర్ రాస్తాడా..ఎంత ధైర్యం వీడికి " కోపంగా అరిచాడు, ఆ అరుపులకి ఇంట్లోఉన్న అమ్మ ఎక్కడ బయటకు వస్తుందో అని హడలిపోతూ ఉన్నది హరిణి, " ఉష్..అరవద్దు ఇంట్లో తెలీకూడదు ఈ విషయం, మనమే డీల్ చేద్దాం మావయ్యకు, అత్తకు తెలిస్తే బయపడిపోతారు " సముదాయించాడు హరిణి బావ. శీను తలపంకించి ఔనన్నట్లు చూసాడు ఇద్దరివైపు. పద అన్నట్లు హరిణిబావ ముందుకు కదిలాడు, అక్కడ ఏమి జరగనట్లే ఇంట్లోకి వెళ్ళారు ముగ్గురు. ఈ విషయం ఏ పరిణామలకు దారితీస్తుందో నన్న భయం పట్టుకుంది హరిణికి, తన పరిధినుండి చేజారిపోయింది పరిస్థితి, చేసేదేమిలేక మౌనం వహించింది. ఇక్కడ ఒక విషయం మరిచిపోయారు హరిణిబావ, శీను ఇద్దరు, అసలు హరిణి వంశికి ఎలా తెలుసు..? హరిణికి తెలిసే అతను ఆ ప్రేమలేఖ రాసాడా..? అన్నది ఎవరు ఆలోచించలేదు.

ఇరువర్గాలు ఒకరికోసం ఒకరు తిరుగుతున్నా...ఆ సాయింత్రం కాదుకదా..! మూడురోజుల వరకు ఎదురుపడలేదు...
ఓ సాయింకాలం పాండురంగ దేవాలయం వీధిలో ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తున్నాడు వంశి, దేవాలయం దగ్గరకు రాగానే ఆలయం పక్కనున్న ఖాలీస్థలంలో ఉన్న నాపరాయి బండలమీద R.T.A శీను, హరిణి బావ, కొంతమంది లారీ మెకానిక్‌లతో కలిసి కూర్చొని ఉన్నారు..వాళ్ళ తీరు చూస్తే..వంశీ కోసం అక్కడ కాపు కాసినట్లుంది..వంశీనిచూడగానే ఎలర్టయి ఒకళ్ళకొకళ్ళు సైగ చేసుకొని " వస్తున్నాడు " అంటూ R.T.A శీను ఒక్కడు మాత్రమే లేచి నిల్చున్నాడు...! వాళ్ళ తీరుచూడగానే వంశీకి పరిస్థితి అర్థమై " వంటిమీద చెయ్యపడకుండా...గొడవజరగకుండా.. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి..మాటల్తోనే...సర్దిచెప్పాలి " మనస్సులో అనుకొని..నేరుగా శీను గ్యాంగ్ వద్దకు వెళ్ళాడు వంశీ తన ఫ్రెండ్స్‌తో, పిలవకుండానే నేరుగా వంశీ తనవద్దకే రావడంతో...గొడవతో మొదలెట్టాల్సిన మాటల్ని మరిచిపోయి..కొద్ది క్షణాలు బ్లాంక్ గా అటు..ఇటూ...చూస్తూ..ఏమ్ మాట్లాడాలో వెంటనే స్పరించక..అసంబద్దంగా " నీవు ఇలాంటివాడనుకోలేదు వంశీ " అంటూ వంశీ వైపు చూశాడు.
"ఎలాంటివాడిననుకోలేదు..? " అడిగాడు వంశీ
ఊహించని మాటకు శీను తికమకగా చూశాడు..
" ఆ..ఆ.. నీగురించి..ఏదో మంచోడివి అనుకున్నా...! ఇలాంటీవాడివనుకోలేదు " మళ్ళి అన్నాడు శీను.
" నేను ఫలానాలాంటివాడిననో..లేక మంచోడిననో..చెడ్డోడిననో నా మెళ్ళో బోర్డేస్కోని తిరగలేదే...! నేను మంచోడినని గాని లేక చెడ్డవాడినని గాని చెప్పి నాతో స్నేహం చేయమని ఎవరిని అడగలేదు, నీవే్దేదో నాగురించి అనుకొని....నీవనుకున్నట్లు నేను లేను అని నన్నడిగితే నేనేమి సమాధానం చెప్పనూ...? అది సరే నాగురించి నువ్వేమి అనుకున్నావో నాకెలా తెలుస్తుంది.. దానికి నన్ను బాద్యత వహించమంటే నేనెలా వహిస్తాను..? అలా అనుకోవడం అన్నది నీకు సంబందించిన విషయం..నీ సమస్య అది..! " అన్నాడు వంశీ.
ఆ మాటలతో కన్‌ఫ్యూజ్ అయ్యాడు శీను..ఏమ్ మాట్లాడాలో అర్థం కాక తనలో తాను " ఎవరైనా తనగురించి బయట మంచిగా చెప్పుకోవాలని ఆశిస్తారు..!వీడేంటి. ..దానికి రివర్స్‌లో ఇలా మాట్లాడుతున్నాడు ! వితండవాదిలా....!!’ అనుకొంటూ ఆలోచిస్తూఉన్నాడు, మళ్ళీ వంశీనే మాట్లాడుతూ....
" నా గురించి నీకోక అభిప్రాయం ఉంటుంది.". తనపక్కనున్న ఫ్రెండ్‌ని చూపిస్తూ..."వీడికొ అభిప్రాయముంటుంది..అలాగే నాకున్న ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒకో అభిప్రాయం ఉంటుంది..అలా అందరి అభిప్రాయాలకనుగుణంగా నేనుండలేను కదా..!! నేను నేనులానే ఉన్నాను ..ఉంటాను...! , ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇది " మంచి " ఇది " చెడు " అని ఒక్కోక్కోళ్ళకి ఒక్కో ప్యారామీటర్ ఉంటుంది, నాగురించి నీవనుకున్న " మంచి " కి ఉన్న ప్యారామీటర్ ఏంటో నాకు తెలియదు, అది నీకు సంబందించిన విషయం...నాకే సంబందంలేదు.. అనవసరంగా నాకు అంటగట్టకు " అన్నాడు.
ఆ మాటలతో శీనుతొ వచ్చిన మనుషుల్లో " వీడితో మాటలేంది..వేసేయ్ రెండు....ఈనాకొడుకు...మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడు " అంటూ ఇద్దరు ముందుకొచ్చారు వంశీ మీద చేయవేయడానికి.
ఆ మాటలతో శీనుతొ వచ్చిన మనుషుల్లో " వీడితో మాటలేంది..వేసేయ్ రెండు....ఈనాకొడుకు...మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడు " అంటూ ఇద్దరు ముందుకొచ్చారు వంశీ మీద చేయవేయడానికి.
" మాట్లాడుతున్నాడు కదా..? మద్యలో మీరిద్దరు దూర్తారేంది...కాసేపు ఊర్కో " అన్నారు వంశీ ఫ్రెండ్స్..
వాళ్ళెవరో R.T.A.శీనుకి బాగా తెలుసు..కాలేజిలో రాడికల్ విధ్యార్థి సంఘం సానుభూతి పరులు..! తనతో వచ్చిన లారీమెకానిక్స్ ఈరోజుంటారు లేదా రేపుంటారు..అంతే ..! కానీ రాడికల్ సంఘం వాళ్ళు చాలా ప్రమాదకరమైనవాళ్ళని తెలుసు ఆ విషయం అర్థమై తనవాళ్ళను " వద్దు వద్దంటూ" వారించాడు శీను. తర్వాత నిదానపడుతూ..

" నువ్వు నా చెల్లెలికి లవ్‌లెటర్ రాయడం కరెక్టేనంటావా..?" అడిగాడు
ఓ రెండుక్షణాలు..దీర్ఘంగా శీను మొహంలోకి చూసి " మనం రెండు మూడుసార్లు కలిసినప్పుడు మాటల్లో సీతాకొకచిలుక, ముద్దమందారం సినిమాల్లోని ప్రేమల గురించి చానా గొప్పగా, ఉన్నతంగా మాట్లాడుకున్నామా..! అప్పుడు ఆ ప్రేమలగురించి...ఆహా..ఓహో అని సమర్తించావు కదా...!!, మరీ అదే కదా నేను ఇప్పుడుచేసింది " అన్నాడు వంశీ.
ఊహించని జవాబు రావడంతో ఏం మాట్లాడాలనుకున్నాడో ఆ విషయాన్ని మరిచిపోయి..ఉక్రోశంగా
" నా చెల్లెలు అలాంటిది కాదు..! " అసంబద్దంగా అంటూ డిఫెన్స్‌లో పడ్డాడు శీను,
అలా డిఫెన్స్‌లో పడడమే వంశీ కోరుకున్నది...అప్పుడే గొడవపెరగకుండా సద్దుమణిగి..పరిస్థితి చల్లబడుతుందని భావిస్తూ...
" ఎలాంటిది కాదూ.. ఉ..?.. ఓమనిషిని ఇష్టపడడం అంటే మీ దృష్టిలో తప్పని అర్థమా..? ప్రేమలు గొప్పవని బహిరంగంగా ఒప్పుకున్న విషయం..మీదగ్గరికి వచ్చేసరకి వాటి అర్థాలు మార్చేస్తూ.." అలాంటిది కాదు..ఇలాంటివాళ్ళం కాదంటూ ఒక తప్పుడు భావాన్ని సృష్టిస్తున్నారు..! అసలు విషయం చెప్పాలంటే నాకు నేనుగా మీ చెల్లెలు చుట్టూ తిరగలేదు....మీ చెల్లలే....!!" అంటూ చెప్పబోయి చుట్టూ ఉన్న శీను గ్యాంగ్ మనుషులను చూసిఆగిపోయాడు.
శీను పక్కనున్న వాళ్ళకి కాస్త మందుపోసి..చీకులు తినిపిస్తే ఎవరివెంటైనా వెళ్తారు, తన పర బేధాలు లేవు.. హరిణి తనే నన్ను చూస్తున్నట్లు చెబితే, ఆ అమ్మాయిమీద ఒక చులకన భావం ఏర్పడి..రేపెప్పుడైనా శీను లేని సమయంలో నేను చెప్పిన విషయాన్ని మనసులోపెట్టుకొని వేధించినా వేదించొచ్చు. ఒక మగవాడు ఎంతమంది ఆడవారి వెంటపడినా..వారి వైపు చూసినా..అది మగతనంకింద లెక్క కడతారు, అదే ఆడది చూస్తే..అదో తిరగబోతని..కాస్త ట్రై చేస్తే పడిపోతుందని..ఓ చులకనభావంతో ప్రవర్తిస్తారు..చాలామంది మగాళ్ళకుండే సహజగుణం..అది. ! అందుకే రేపెప్పుడైనా హరిణికి చేదు అనుభవం ఎదురవచ్చనే ఉద్దేశంతో చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండా గొంతులోనే నొక్కేసుకొని....

"మగ ఆడలమద్యన ఇష్టాలు ఏర్పడడం సహజం..అదేమి చట్టవ్యతిరేకం కాదు..తప్పని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు..! నాకు ఇష్టమనిపించింది....! అలా ఇష్టపడిని మనిషితో స్వయంగా నా ఇష్టం గురించి చెప్పాలనుకొన్నా.... ! అలా చెప్పగలిగే వాతావరణంలేక లెటర్ రాశాను..అంతే.." ఇందులో తప్పేముంది అన్నట్టు చూసాడు శీనువైపు.
పక్కనున్న హరిణి బావ చొక్కచేతులు పైకి మడుస్తూ...రోషంగా.." మేము ఎట్లాకనబడుతున్నాం నీ కండ్లకు...మాకు వెనకా ముందు ఎవరూ లేరనకుంటున్నావా..? అంతధైర్యంగా ఇష్టమని చెబుతున్నావ్..! ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదు.." అన్నాడు.

" ఆవేశపడకు బ్రదర్...! ఇష్టపడడానికి..వెనకా ముందు ఎవరులేకపోవడనికి సంబందం లేదుగాని..? నేను అనుకున్నది నాలో ఉన్నది చెప్పా..దానికి..మీరు అవుననొచ్చు..కాదనచ్చు..అది మీ ఇష్టం " అన్నాడు వంశీ
వెంటనే శీను అందుకొని.." మా చెల్లెలికి నువ్వంటే ఇష్టంలేదు " అనేసాడు.
" మీ చెల్లెలికి ఇష్టం లేదా..? నీకిష్టంలేదా..?"
" మా చెల్లెలికే ఇష్టం లేదు " అబద్దం చెప్పాడు.
" ఓకె...ఆమెకి ఇష్టం లేనప్పుడు ..నేనుకూడా ఇంతటితో ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తాను..మీకునాకు ఎటువంటి గొడవలు లేవు..ఒకె బై.." అంటూ..షేక్ హ్యాండ్ ఇచ్చాడు వంశీ..
శీనుకి సమస్య ఇంతసులువుగా పరిష్కారం కావడం చాలా ఆశ్చర్యం వేసింది...కాని హరిణి బావకు..కూడ వచ్చిన గ్యాంగ్‌కి వంశీని కొట్టకుండా వదిలేయడం నచ్చలేదు..అసలు భరించలేకపోతున్నారు.
" ఇంకోసారి హరిణి వెంటాడినా..అటువైపు చూసినా ఊర్కొనేదిలేదు " అంటూ వేలెత్తి హెచ్చరిస్తూ అక్కడ నుండి వెనుతిరిగారు..
" చెప్పానుగా...ఏమిలేనిదానికి ఎందుకు మళ్ళి బెదిరింపులు "
శీను " ఓకె..ఓకె..ఏం జరగలేదనుకుందాం.." అని సర్దిచెప్పి అక్కడ నుండి శీను తన గ్యాంగ్‌తో సహా నిష్క్రమించారు.
చంద్రహాస్ మినహా మిగతా వంశీ ఫ్రెండ్స్ " సరే మేము వెల్తాము, నీమాటలు వాళ్ళకేమోగాని మాకు కూడ సరిగ్గ అర్థం కాలేదు, ఏదేమైనా సమస్య తీరిపోయింది కదా..అది చాల్లే మనకు సరే మేము వెల్తాము " వంశీకి బై చెప్పి వెళ్ళిపోయారు.
" నేను కూడ చాలా తికమకపడ్డాను నీ మాటలకు " ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయాక అన్నాడు చంద్రహాస్
" ఇందులో తికమక ఏముంది " ప్రశ్నించాడు వంశి.
" ఎవరైనా గాని ఎదుటివాడు మంచోడనే కదా ఫ్రెండ్స్‌షిప్ చేసేది..! మరి నీవేంది ’నెను మంచోడినో లేక చెడ్డోడినో అని బోర్డ్ మెడలో వేసుకొని తిరగట్లేదు ’ అని తింగర సమాదానం ఇచ్చావు అది కరెక్టేనంటావా..? " అడిగాడు చంద్రహాస్
" మల్లీ మొదటికొచ్చావు నీవు....నీకు ఇప్పడవన్ని చెప్పడం నావల్ల కాదు కాని, నేనలా చైతన్య అన్న దగ్గరికి వెల్లస్తాను " అన్నాడు.
" సరిపోయింది..సన్యాసి..సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందట...అట్లా ఉంది నీ వ్యవహారం..! మీరిద్దరు కలిస్తే మాకు అర్థం కాని మాటలేవో మాట్లాడుకుంటారు, మాకవన్ని ఎక్కవులే... వెళ్ళు వెళ్ళు " బై చెప్పి చంద్రహాస్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు, వంశి చైతన్య ఇంటివైపుకు దారితీసాడు .
చైతన్య ఒకప్పుడు ఇల్లెస్ట్రెడ్ వీక్లీలో, అలాగే ఇండియన్ ఎక్స్‌ప్రెస్స్ లలో సబ్ ఎడిటర్ గా పని చేసాక..తర్వాత కొన్నాళ్ళకు అవేవి తనకు నచ్చక రాజీనామా చేసి పుట్టిన ఊరికి చేరి ఒక మౌనిలా వంటరి జీవనం సాగిస్తున్నాడు, 36 ఏళ్ళ వయసు ఉంటుంది, నిరంతర అన్వేషిలా ఉంటాడు, అతని వద్ద ఒక పెద్ద లైబ్రరరీ ఉన్నది ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటాడు. సమస్యలతోనూ..లేక సందేహాలు నివృత్తి చేసుకొనేందుకు తనవద్దకు వచ్చే వారికి తనకు తెలిసిన, తోచిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాడు, వంశి తను చదివిన పుస్తకాలలోని అర్థం కాని విషయాల గురించో లేక వాటిలోని విషయ పరిఙ్ఞానం గురించి తెలుసుకోవడానికి చైతన్య వద్దకు వచ్చి చర్చిస్తూఉంటాడు.
* * *
కొన్నిరొజుల గడిచాయి, ఒకరోజు రాత్రి 7 గంటల సమయంలో వంశీ బయట తిరుగుల్లు అయ్యాక ఇంటికి వెళ్ళాడు.... వెళ్ళగానే తల్లితండ్రులు వంశీ మీద కేకలు వేయడం మొదలు పెట్టారు.." ఏరా నీకు బుద్దుందా..అసలు నువ్విట్లా చేస్తావని మేం అస్సలూహించలేదు.. ఇంటి మీదకు గొడవలుతెస్తావా.." ఆవేశంలో అసలు విషయం చెప్పడం మరిచిపోయి కేకలు వెశారు. దేనిగురించి అరుస్తున్నారో ఏంటో వంశీకేమి అర్థం కావడంలేదు..
" ఏం అయ్యిందమ్మా..? ఏంటి నాన్న..విషయం చెప్పకుండా అలా అరుస్తున్నారు " అడిగాడు వంశీ.
" వాడెవడొ శీను అంటా చూస్తే రఫ్‌గా లారీ క్లీనర్‌లా ఉన్నాడు..పదిమంది జనాల్నేసుకొని ఇంటిమీదకొచ్చాడు..వద్దని చెప్పినా వాళ్ళ చెల్లల్ని వెంటపడుతున్నావంటా..ఆ అమ్మాయికోసం సినిమాకి కూడా వెళ్ళావంటా...నీకొడుకు కాళ్లుచేతులు తీస్తాం నరుకుతాం అని నానారంకెలేశాడు.. ,మీరు బాగా చదువుకున్నవాళ్ళు..ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు..మీ అబ్బాయిని ఇలానెనా పెంచేదని నానా మాటలన్నారు. వీధిలో అందరూ మనింటి వైపే చూస్తున్నారు..మాకు తల తీసినట్లైయింది..! " అన్నది వంశీ తల్లి.,
" ఏంట్రా..ఇదీ ఈ వయసులో ..మాకిలా అవమానాలు..! అవసరమా..? " అడిగాడు వంశీ నాన్న. వారి మాటలతో వంశీకి పట్టరాని కోపం వచ్చేసింది
ఇంకా ఏదో చెప్పబోతున్న తల్లి మాటలని మద్యలోనే వంశీ కలగజేసుకొని..ఆవేశంగా..." ఆనాకొడుకు ఇంటిమీదకి వస్తాడా...? అప్పుడే ఏం సంబందం లేదని చెప్పా " అంటూ అక్కడ నుండీ విసురుగా బయటకు వచ్చాడు..
" ఒరేయ్...ఆగరా..గొడవలొద్దురా మనకీ " అంటున్న తల్లితండ్రుల వైపు తిరిగి.." నేను గొడవపెట్టుకోవడానికి వెళ్ళడం లేదు...జరిగిన విషయం ఏంటో..చెప్పడానికి వెళ్తున్నా మీరు ఎక్కువగా ఊహించుకొని భయపడవద్దు..అసలేం జరగలేదు " అని చెప్పి వెళ్ళిపోయాడు వంశీ.
.......ముగింపు వచ్చే వారం
.......ముగింపు వచ్చే వారం
5 comments:
కమల్ గారు, చాలా బాగుంది కథ.. మీ కథనం.. ముఖ్యం గా వంశి పాత్రని చాలా చక్కగా డిజైన్ చేశారు.. తరువాతి కథ ఎప్పుడు ప్రచురిస్తారు..??
మనసు పలికే @ గారికి....కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్సండి, అసలు ఈ కథ కొన్ని రోజులనుండి పోస్ట్ చేయాలా... వద్దా... అని సందిగ్ధావస్థలో ఉన్నా, మరి ఎక్కువగా మాటలు రాయడం వలన కథ ముందుకు సాగడం లేదేమో అని నా అనుమానం, అలాగే ఇప్పటి స్పీడ్ యుగంలో ఇలాంటివి చాలా బోర్ కొడతాయేమో అని చిన్న ఊగిసలాట ఉండేది నాకు. వీలు కుదిరితే వచ్చేవారమే ప్రచురిస్తాను, మరో మారు మీకు.. చాలా థ్యాంక్సండి.
కమల్! కధ బావుంది. కాస్త నిడివి ఎక్కువైనా కాని పాత్రల స్వభావాలు అర్ధమ్ కావటానికి ఆ మాత్రమ్ అవసరమ్ అనిపించింది. తరువాతి కధ కోసం చూస్తూ...
కమల్ గారు బగుంది :)
"అసలు విషయం చెప్పాలంటే నాకు నేనుగా మీ చెల్లెలు చుట్టూ తిరగలేదు....మీ చెల్లలే....!!"
వంశీ పాత్ర వైపు కూర్చొని రాసారు అనుకుంటా .. నాకైతే ఇక్కడ ఒక మగవాడి ఆలోచనలని పక్కా దింపారు అనిపిచ్చింది :))
అఫ్కోర్స్ లెటర్ చదివాక హరిణి మనసులో ఏమున్నదో తరువాతి ముగింపులో చూడాలి :)
ఒకొక్కసారి నావెలిటీ బాషలో ఇంకొకసారి వాడుక బాషలో రాసారు అక్కడక్కడ ..బోర్ అయితే కొట్టించలేదు ..
ముగింపు వచ్చే వారం అన్నారు ఎప్పుడు పోస్టింగ్ ??
చాలా బాగా రాస్తున్నారు. దయచేసి కొనసాగించండి
Post a Comment