నా రోడ్ ట్రిప్‌లో భాగంగా ఆరవ రోజు..    హోటల్ రూమ్‌లో పొద్దున్నే ల్యాప్ టాప్ ముందర కూర్చోని చుట్టు పక్కల ఏమేమ్ వున్నాయో చూడదగ్గ ప్రదేశాలంటూ వెదుకుతూ కుర్చున్నాను. మా టూర్ ఫ్రోగ్రామర్ మాత్రం ఇక్కడ దగ్గరలో ఏవి లేవు అన్ని వంద కిలోమీటర్ల్ దాటి వెళ్లాలి దానికన్నా "ఆగుంబే" వెళ్లిపోవడం మంచిదంటూ కూర్చున్నాడు. నాకేమో చుట్టూ వున్న చూడదగ్గ ప్రదేశాలను చూడకుండా వెళ్లడం ఇష్టం లేదు. గూగుల్ సెర్చ్‌లో మంచి ఆర్కిటెక్చర్ వున్న దేవాలయం ఫోటొ కనపడ్డది. ఆ ఫోటో పట్టుకొని అదెక్కడ... అని వెదికితే..  మేముంటున్న షిమొగా వూరుకు 90 కిలోమీటర్ల దూరంలో వున్నదని చూపిస్తున్నది.  మా టూర్ ఫోగ్రామర్ మాత్రం మళ్లీ వెనక్కు 90 కిలోమీటర్ల్ వెళ్లడం ఎందుకు "ఆగుంబే" దారిలొ ఏవైనా వుంటే చూసుకొంటూ వెళ్లిపోదాం అని చెబుతున్నాడు.  నేను ససేమిరా అంటు పట్టు బట్టి బయలు దేరాం.

 వాస్తవంగా జోగ్ ఫాల్స్ నుండి షిమొగాకు వచ్చే దారిలొ "సాగర్" అనే వూరు వున్నది. మేము ఆ వూరు మీద నుండే వచ్చి షిమోగాలో నైట్ హాల్ట్ చేసాం. ఇప్పుడు మేము వెళ్తున్న ఆ దేవాలయం సాగర్ వద్ద నుండి ఓ మూడు కిలోమీటర్ల్ లోనకు ప్రయాణించాలి.  తిరిగి వెనక్కు వెళ్లి చూడటం అంత అవసరమా అని మిత్రుల ఆలోచన.. ! ఫోటోలో ఆ ఆర్కిటెక్చర్ చూడగానే ఆకట్టుకొంది...!


  సాగర్ నుండి మూడు కిలోమీటర్లు దూరంలో ఎడమ వైపుకు వెళ్లాక ఈ "ఇక్కేరి" దేవాలయం కనపడ్డది. అప్పటి వరకు అయిష్టంగా వచ్చిన ఇద్దరు మిత్రులు..ఆ దేవాలయం ముఖ ద్వారం చూడగానే మొహాలు విప్పారాయి.ఆ ఆర్కిటెక్చర్....ఆ పచ్చని ప్రదేశం మద్యలో ఆ కొత్త రకమైన రూపురేఖలతో కనపడుతున్న దేవాలయం చూడగానే వీరి మొహాల్లో ఆశ్చర్యంతో కూడిన మైమరుపు...  హమ్మయ్య అనుకొన్నాను నాలోపల...! అది గాని అతి సాదారణంగా వుండుంటేనా...?? అంతే  " చెబితే విన్నావా.. చూడు ఏవైనా బాగున్నదా.. ఇలాంటివి మనూళ్లో లేవా ఏంటి.. వీటి కోసం అన్నేసి గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావాలా" అంటు నామీద దాడి చేసేవాళ్లు.


  లోపలి వెళ్లగానే ఆ శిల్పాలను.. వాటిని మలిచిన తీరును చూస్తూ అబ్బరపడిపోతున్నాం.  ఫోటోస్ తీసుకోవడానికే సత్తాను చేతుల్లోకి తెచ్చుకొంటూ ఉత్సాహ పడిపోతున్నాం అందరం. అదో రకమైన శైలి అవి. దేవాలయం పైన మాత్రం ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కనపడుతున్నది. మండపాలు మరో శైలి.. ఇలా చాలా రకాలు కనపడుతున్నాయి.  గుర్తించడం నాబోటి అఙ్ఞానికి చాలా కష్టం.


 మరో వైపున శిల్పం మొత్తం ఆనవాలే లేకుండా కేవలం పాదాలు మాత్రమే మిగిలి వున్న శిల్పం గుడికి దూరంగా అదే ప్రహరి మద్యలో ఒక మండపం మీద వున్నది దాని చుట్టు మరి కొన్ని ద్వంసమైన కళారూపాలు వున్నాయి.

 లోపల గర్భ గుడికు ముందు శిల్పాలతో చెక్కిన పదుల సంఖ్యలో స్థంభాలతో కూడిన పెద్ద హాల్ వున్నది. అక్కడ ఫోటోస్ తీయడానికి తగినంత వెలుగు లేకపోవడంటొ ఫోటోస్ సరిగ్గా తీయలేకపోయాను. లోపలికి కెమెరా ట్రైపాడ్ అనుమతి లేదట.


   దాదాపుగా ఓ గంటన్నర సమయం ఫోటోస్ తీయడానికే గడిచిపోయింది. అక్కడ నుండి తిరిగు ప్రయాణానికి కారులొ సిద్దమవుతూ.. అక్కడే వున్న ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ చిరుద్యోగిని కలిసి చుట్టూ వున్న మరిన్ని చూడతగ్గ ప్రదేశాల వివరాలు తెలుసుకొందామని కారులో నుండి అతని వద్దకు వెళ్లాను. అలా వెళ్లడం వలన నాకు మరింత చరిత్ర తెలుసుకొవడానికి దోహద పడింది. ఒక రకంగా నా బుర్రకు మేత దొరికింది. నిజంగా ఆ క్షణం అలా సమాచారం సేకరించాలనే తలంపు రావడమన్నది లక్కీనే అనుకోవాలి.


 ఆ చిరుద్యోగిని కాస్త కదపగానే మెల్లి మెల్లగా చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు. బయలు దేరాలనుకొన్న ఇద్దరు మిత్రులు కూడ వచ్చి చేరి మళ్లీ తిరిగి ఆయనతో పాటు ఆ చరిత్ర వింటూ ఆశ్చర్యపోతూ మళ్లీ మరికొన్ని మేము చూడ కుండా మిస్ అయినా శిల్పాల ఫోటోస్ తీసుకోవడం మొదలు పెట్టాం.


 ఆ టెంపుల్ గురించి ముద్రిత సమాచారం అక్కడ హింధీలో వుండటం వలన కేవలం ఆ ఆర్కియాలజీ డిపార్ట్‌మెట్ం చిరుద్యోగి చెప్పిన చరిత్ర విశేషాలనే నేనిక్కడ ఇస్తున్నాను.  ఇవి ఎంత వరకు అథింటికేట్ అన్నది నేను కూడ చెప్పలేను గానీ.. .. ఆయన మాటల్లోనే....

 కేలడీ నాయకులు అని పిలువ బడుతున్న  చౌడప్ప నాయక, సదాశివ నాయక, చిక్కశంకర నాయక ( చిన్న శంకర ), దొడ్డ శంకర నాయక ( పెద్ద శంకర ),శివప్ప నాయక, అక్కవ, కెలడి చెన్నమ్మ అనే ఏడుగురు రాజులు ( విక్కీలో మాత్రం మొత్తం 17 మంది రాజుల పేర్లు చెబుతున్నది ). కెలడీ రాజ్యంలొ బంగారు విరివిగా దొరుకుతుంది. వీరి బంగారను అక్కడుకు, విజయనగరం సామ్రాజ్యపు వజ్రాలు వైఢూర్యాలు వీరికి ఇచ్చిపుచ్చుకొనే ప్రాతిపదికన వీళ్లు విజయనగర రాజులకు సామంతులుగా కెలడీని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించే వారట. అలా 24 క్యారెట్స్ బంగారం అనే కొలతను వీరి నుండే ప్రారంభమైందట. వీరి పాలన దాదాపుగా 250 సవంత్సారల పైనా సాగింది. (1540 - 1760 )

 వీరి పాలనలో బంగారు నాణేలు అర్థ చంద్రుడు, పూర్తి చంద్రుడు ఆకారంతో చలా మనిలో వుండేవట. వీరి హయాంలోనే 15 వ శతాబ్దంలో ఈ ఇక్కేరిని రాజధానిగా చేసుకొన్నాక ఈ అఘోరేశ్వర దేవాలయం నిర్మించారు. ఇది పూర్తిగా నాలుగు రకాల శైలితో నిర్మించారు. ద్రవిడ శైలి, హోయసల శైలి, చాళుక్య శైలితో పాటు గుడి పైన వుండే గోడలు "ఇస్లామిక్" శైలితో వుంటాయి. అదే ఇక్కడి ప్రాముఖ్యత. మరొక విషయం భారతదేశంలొ దేవాలయాలన్నీనూ తూర్పు దిక్కుకు ముఖ ద్వారం వుండేలా నిర్మిస్తారు. కాని ఈ ఇక్కేరి దేవాలయం మాత్రం ఉత్తర దిక్కకు ముఖ ద్వారం వుంటుంది.


 అంతే కాకుండా దేవాలయానికి ముఖ ద్వారం వద్దనే "నంధీశ్వరుడి" మండపం వుంటుంది ఇదొక కొత్త శైలి. అందునా గర్భ గుడిలోని ప్రధాన విగ్రహానికి చాలా దూరంలో (58 అడుగులు) వున్నది. మళ్లీ గర్భ గుడిలొ మరొక అమృత శిలగా పిలవబడుతున్న ట్రాన్స్‌పరెంట్ నంధీ విగ్రహం వున్నది. చీకటిలో టార్చి లైట్ వెలిగించినా ఆ వెలుగు ఆ విగ్రహం గుండా మరో వైపుకు ప్రవహిస్తుందట.




 ఇక ఈ అఘోరేశ్వరుడి విగ్రహం 32 చేతులలొ 32 ఆయుధాలు ధరించి వుంటుదట...! ఇక్కడ ఈశ్వర పార్వతీల విగ్రహాలతో వుండే పీఠం పాద, జగతి,పట్టి, పద్మ,కళా, పట్టి,వేదకి అనే ఏడు పీఠాలతో నిర్మించారట. ఏడవ పీఠం మీద 32 మందిని స్త్రీ దేవతా మూర్తుల శిల్పాలను మొలిచారట. వాటిని "శక్తి పీఠం" గా పిలువ బడుతున్నారు.




ఇక అన్ని గుళ్లల్లోను వుండే "రతి భంగిమల" విగ్రహాలు ఇక్కడా చెక్కబడి వున్నాయి. నేనిప్పటి వరకు చూసిన ప్రతి హిందూ దేవాలయాలలో ఈ వాత్సాయనుడి రతిభంగమలు చూస్తూనే వున్నాను. బహుశ ప్రపంచానికి ఈ దేశం నుండే సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభమైందేమో అని అనిపిస్తూ వుంటుంది నాకు. మద్యలో ఏర్పడిన నాగరికత పౌర సమాజం నుండి వచ్చిన మత పెద్దలు వీటిని సమాజ హితం కోసమంటూ కొన్ని అంక్షలు పెట్టడం వలన అయితేనేమి..? సెక్స్ అన్నది కేవలం "మగవాడి" సామర్థ్యానికి, గొప్పదనానికి ప్రతీక అనే ఒక భావజాలంలో వుండడం వలన అది నలుగురిలో ఒక సబ్జెక్ట్ లాగ మాట్లాడుకొనే దశను కోల్పోయి అదొక అశ్లీలత, బూతు వ్యవహారంగా భౌతిక ప్రపంచంలో చలామని కావడం మొదలయ్యింది.

 మేము అక్కడున్నప్పుడే కొందరు కాలేజీ యువతీయువకులు అక్కడికొచ్చారు. అందులొ ఉత్తర, దక్షణ భారతదేశీయులు వున్నారు. అందరిలాగ ఒకరిద్దరు యువకులు ఈ భంగిమలు చూడగానే మొహం విప్పారి తోటి వారికి చెప్పాలనే ఉత్సాహంతో వెర్రికేక పెట్టి చూపుతుండగా మరి కొందరు తమతో వున్న అమ్మాయిలకు కూడ చూపి వాళ్లెలా ఫీల్ అవుతారో అని గమనించసాగారు.  దానికా ఒకరిద్దరు అమ్మాయిలు "హ్మ్..దానిదేమున్నది అవన్ని సహజం అప్పట్లో.. దేవాలయాల్లో అదొక అంశం" అంటూ అదొక సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లా మరొక సబ్జెక్ట్ అనే భావంతో ఎటువంటి వికారాలు, అసభ్యమైన కోణాలు లేకుండా చర్చించుకోవడం మొదలు పెట్టారు.

 ఇక్కడ ప్రభుత్వాలు వెబ్‌సైట్స్ మీద బ్యాన్ విదిస్తే విదించొచ్చు కాని ఇలాంటి దేవాలయాలలొ బహిరంగంగా వున్న ఈ భంగిమలను చూడకుండా ఎవరు ఆప లేరు కదా..?




 ఇక దేవాలయం విషయానికొస్తే..

  ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే చాలా చాలా సాంకేతికమైన విషయాలు బాగా తెలుస్తాయి. అంత టెక్నికల్‌గా నిర్మించారు ఈ దేవాలయాన్ని.

 ఇక్కడికి చేరాలనుకొనే దారి. కర్నాటకలోని జోగ్ ఫాల్స్ నుండి షిమోగా వెళ్లే దారి మద్యలో "సాగర్" అనే తాలుకా ఎదురవుతుంది. ఆ వూరి నుండి లోపలికి ఓ మూడు కిలోమీటర్ల్ ప్రయాణిస్తే ఈ "ఇక్కేరి" టెంపుల్‌కు వెళ్లొచ్చు.  షిమోగా నుండి 90 కిలోమీటర్ల్ సాగర్ వైపు ప్రయాణించినా ఇక్కడికి చేరుకోవచ్చు.

 వీటి చుట్టు పక్కల ఇంకా చూడాలసిన ప్రదేశాలు చాలా వున్నాయి. మాకున్న సమయభావం వలన అవన్నీ చూల్లేకపోయాం. కేలడి వూరు అందులోని టెంపుల్, అక్కడే వున్న కేలడీ రాజుల కోటలు నాలుగు వున్నాయి.  ఇవే కాక చాలా చాలా పచ్చని లాండ్ స్కేప్స్ చాలా వున్నాయి.  ఇక్కడ నుండి ఆగుంబే వెళ్లే దారిలొ "తీర్థ హల్లి" అనే మరొక వూరు వొస్తుంది. అబ్బో ఆ వూరు చుట్టు కొన్ని కిలోమీటర్ల్ ప్రయాణిస్తే చాలు ఎన్నో జలపాతాలు, పచ్చని ల్యాండ్ స్కేప్స్, సరస్సులు బోలెడు చూడొచ్చు. మొత్తం పచ్చదనమే..ఎక్కడ చూసినా కనుచూపు మేర పచ్చదనమే కనపడుతుంది. ప్రకృతి ఆరాధకులకు పండగే పండగ.........!!

 ఈ ఇక్కేరి రాజధాని గురించి మరింత క్షుణ్నంగా సమాచారం కోసం గూగుల్‌, విక్కీలో చాలా దొరుకుతుంది. అక్కడ మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

మరి కొన్ని ఫోటోస్.......!!


      అప్పట్లో  ఎన్నేసి రకాల స్త్రీలకు జడ కుచ్చులు వేసారో ఈ శిల్పంలో చూడొచ్చు.....


     అప్పటి అంతపుర స్త్రీలు ధరించిన "వ్యానిటీ బ్యాగ్" ఈ చిత్రంలో..!!


      ఇస్లామిక్ పరిపాలనలో సింహాలకు ముస్లీమ్ రాజుల్లా వుండే వారి గడ్డాలనే ఇక్కడున్న సింహాలకు ముస్లీమ్ సింహాల్లాగా శిల్పాలను అక్కడక్కడ చెక్కించారు.
































12 comments:

గుడి చాలా అందంగా ఉంది. మీ ఫోటోలు గుడిని మరింతబాగా చూపించాయి. మీరు ఉపయోగించే కెమేరా ఏమిటో తెలుసుకోవచ్చా?

థ్యాంక్యూ... Dantuluri Kishore Varma గారు. Nikon D90 అండి. కెమెరా ఏది వాడిన ఎలానూ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఫోటోస్ ఎడిట్ చేయాల్సిందే. :-)

sir adbutham sir

హలో కమల్ గారూ భారత్ లో మంచి ఆర్కిటెక్చర్ కలిగిన దేవాలయాలు చాలానే వున్నాయి. కానీ ఏది చూసినా అద్భుతంగానే వుంటుంది. ఇంతమంచి దేవాలయాన్ని మాకు చూపించినందుకు చాలా చాలా కృతజ్నతలు. నాక్కూడా మంచి ఆర్కిటెక్చర్ కలిగిన కట్టడాలను చూస్తే మైమరచిపోతాను. మంచి సమాచారాన్ని మాకు చెప్పినందుకు (తెలియజేసినందుకు మరొక్కసారి కృతజ్నతలు)

Simply superb అండి !
Btw, 6 వ రోజు అని రాస్తే ఆ ముందు చూసిన ప్లేసెస్ , అక్కడి పిక్చర్స్ ముందు పోస్ట్లలో ఉన్నాయేమో నేను చూడటం మిస్ అయ్యాను అని వెతికా :-( అదేంటి డైరెక్ట్ 6th డే కి వచ్చేసారు ?

థ్యాంక్యూ @ Ashok Kumar గారు

చారిత్రిక దేవాలయాలు అక్కడున్న శిల్ప సౌందర్యం.... చూట్టానికి చాలా బాగుంటాయండి. ఒక్కటనీ కాదు. థ్యాంక్సండి మీ స్పందనకు @ Naga Mani గారు.

Sravya V @ మిగతావి కూడ రాస్తానండి, కాకపోతే ఈ ఇక్కేరి చరిత్ర ఎక్కడ మరిచిపోతానో అనే ఆలోచనతో ముందుగా రాసాను. మిగతా వివరాలు కూడ తొందరగా రాస్తాను. థ్యాంక్యూ మీ స్పందనకు.

అద్భుత:

Good info

గుడి చాలా బాగుంది....ఫోటోలు బాగా తీసారు. Good info for travellers.

@kamal,

ఫోటోస్ బాగా వచ్చాయి.ట్రావెలాగ్ వ్రాయాలంటే వెంటనే వ్రాసెయ్యాలి.బద్దకించామంటే అనుభూతులన్నీ మర్చిపోతాం.మిగతావి కూడా త్వరలో వ్రాసేయండి.

waow. The sculpture is similar to Konark Sun Temple. The vanity bag, tantric sexual practices and the pillars, look the same. May be the sculptors were disciples of same guru ! :)

చాలా గొప్పగా రాశారు. ముఖ్యంగా పారదర్శక నంది గురించి తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs