నాఊహ తెలిసినప్పటినుండి నాచుట్టూ జరిగిన..లేక నే చూసిన సంఘటనలను యధాతదంగా కథలుగా రాయాలన సంకల్ఫంతో ఈ శీర్షిక ప్రారంభిస్తున్నా,      " నే " లేక " నా " అన్న పదానికి తత్వశాస్త్రరిత్యా " అహాన్ని " ఆపాదిస్తాము సహజంగా..  ! నేచూసిన లేక నా చుట్టూ జరిగిన అన్న వ్యాక్యాలు  కేవలం సంబోదనారిత్యా ఉపయోగించిన పదమే, ఇక " యధాతదంగా " అన్న పదం ఉపయోగించడానికి గల కారణం.....!   వాస్తవంగా మనకు ఊహ తెలిసినప్పటినుండి పెరిగేవిదానంలో అందరికీ తల్లితండ్రుల ప్రభావం కాని, బయట పాఠశాల ఉపాధ్యాయుల ప్రభావం కాని, లేక మరే ఇతర ప్రముఖవ్యక్తుల ప్రభావం కాని, లేక మనకిష్టమైన ప్రియమైన మనుషుల ప్రభావం కాని ఉండే ఉంటుంది అది సర్వసాదారణ విషయం, అంటే మనకు తెలీకుండానే మనలో కొన్ని స్థిరాభిప్రాయాలు (ఫిక్సడ్ ఒపినీయన్స్) ఏర్పడతాయి, అలాగే పెంచబడుతాము కూడ, పూర్తిగా మరోకరి అభిప్రాయాలనే మనవిగా కాకపోయినా కాస్తో కూస్తో పాక్షికంగా మనలో నిగూడమైఉంటాయి, ఇంట్లోని తల్లితండ్రులు , స్కూల్లో ఉపాధ్యాయుల వారి వారి మానసికస్థితినిబట్టి చెప్పే మంచిచెడులు.. వాటికి వారు వివరించే ఉపమానాలు, పోలికలు ( కంపారిజన్) చాలామందిలో ఒక స్థిరాభిప్రాయంలా నిక్షిప్తమైఉంటాయి,  అలా ఒక ఫిక్సడ్ అభిప్రాయంగల కోణమనే కలర్ అద్దాలను  కళ్ళకు తగిలించుకొని మన చుట్టూ ఉన్న సమాజాన్ని,ప్రపంచాన్నిచూడడం మొదలెడతాము, మనముందు జరిగే ప్రతి సంఘటనా ఆ రంగుటద్దాలనుండే చూడడం వలన....., చూసే ప్రతి సంఘటన ఒకే రంగులో కనపడుతుంది. అలా ప్రతి ఒక్కరికి ఒక్కో ఫిక్సడ్ అభిప్రాయముంటుంది, ఒకే సంఘటనను రకారకాల వ్యక్తులు ఒకే సమయంలో చూసినా.. రకరకాల  అభిప్రాయాలు వ్యక్తమవుతాయి, జరిగిన ఆసంఘటనకు " యధాతదం " ఉండదు... ఒక " వాస్తవం " ఉండదు.     నేను అనబడే నాకు ( ఇందులో అహం లేదు సుమా) ఎటువంటి ఒక ఫిక్సడ్ అభిప్రాయాలు కాని, కోణాలు, రంగుటద్దాలుకాని లేవు, నాపై ఎవరి ప్రభావం లేదు.. నే చూసిన ప్రతి సంఘటన ఎటువంటి ఫిక్సడ్ అభిప్రాయమనే కోణంనుండి కాక యధాతదంగానే చూసాను..వాటిని యధాతదంగాని ఇక్కడ వ్రాయడానికి ప్రయత్నిస్తున్నా, మరి పైన "నేచూస్తున్నా..నా చుట్టూ.." శీర్షిక పెట్టావు కదా..అలా అన్నప్పుడే వాటిలో ఒక అభిప్రాయముంటుంది కదా అని అనుమానం రావచ్చు..అది కేవలం సంబోదనరిత్యా ఉపయోగించినదే అని నా వివరణ.
              కథకు కొన్ని లక్షణాలు ఉంటాయి, కాని నేను రాసే కథలకు ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు, అందుకు కారణం నేను చేయితిరిగిన రచయతను కాదు కదా..కనీస అతిసామాన్య రచయతను కూడ కాదు, అలాగని ఈ శీర్షిక ద్వార రచయత కావలనే అత్యాశ కాని దురాశ కాని ఏకోశాన లేదు, రచనలు చేయడం నిజంగా అందరు వెలిబుచ్చినట్లే...అదొక ప్రసవవేదన, అంతసులభం కాదు, ఒక్కో క్యారెక్టర్‌ని ఒక్కోవిదంగా సృష్టించాలి, ప్రతి క్యారెక్టర్ కి ఒక వ్యక్తిత్వమంటూ ఉండాలి..ఆ క్యారెక్టర్‌ని రచయత  తనచేతి వ్రేలుపట్టి నడిపించకూడదు, కేవలం ఆ క్యారెక్టర్ వెళ్ళే తోవను తిన్నగా వెళ్ళెవిదంగాచూడాలి..ఇలా ఎన్నో ఎన్నెన్నో..! కాని ఆ కష్టాలేవి లేవు నాకు..కారణం... అన్నీను వాస్తవంగా నాకళ్ళముందు జరిగిన సంఘటనలే అందులోని క్యారెక్టర్సే ..చాలా సులభం కాకపోతే ఒక వరసక్రమ విదానంలో అనుసందానం చేయాలి.

          నేను లబ్దప్రతిష్టగల రచయతను కాను కాబట్టి నేను రాసే కథల్లో చదివించే గుణం లేకపోవచ్చు,ఆసక్తి కలగక పోవచ్చు, లేక బోర్‌కొట్టవచ్చు..కాని అవన్ని వాస్తవాలే..! మరి చదివించే గుణం లేనప్పుడు..బోర్‌కొట్టే విదంగా ఉంటే మేమెందుకు చదవాలి అని మీకో ప్రశ్న ఉదయించవచ్చు..అది సహేతుకం కూడ...! కాని నేను చూసిన సంఘటనలు మీ ముందు పెడితే మీ స్పందన ఎలా ఉంటుందో చూడలనే తాపత్రయం...నాది. !  బోర్‌ కొడితే ఎలాగు మీచేతిలో చిట్టెలుక ఉండనే ఉన్నది గా..ఒకే ఒక క్లిక్ చాలు....మీకు......

0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs